Trisha: నేను కూడా సిద్ధమే.. 10 ఏళ్ల తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అందాల త్రిషా
ఏకంగా 24 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికీ క్రేజ్ దక్కని అతికొద్ది మంది హీరోయిన్ల జాబితాలో ఒకరిగా త్రిష పేరు సంపాదించుకోవడం విశేషం. తాజాగా పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మళ్లీ ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమా విజయంతో త్రిషాకు మళ్లీ వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా 'ఎక్స్'లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్‌తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది త్రిష. త్రిష కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో...
1999లో తమిళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయమైంది అందాల తార త్రిష. కెరీర్ మొదటి నుంచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది వరుస అవకాశాలతో దూసుకుపోయింది. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తర్వాత వచ్చిన ‘వర్షం’ సినిమాతో తొలి కమర్షియల హిట్‌ను అందుకుంది. ఇక అప్పటి నుంచి ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. వరుస విజయాలతో తెలుగు కుర్రకారు హృదయాల్లో చెరగని సంతకం చేసింది. తెలుగులో దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించిందీ చిన్నది. తెలుగుతో పాటు అడపాదపడా తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఏకంగా 24 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికీ క్రేజ్ దక్కని అతికొద్ది మంది హీరోయిన్ల జాబితాలో ఒకరిగా త్రిష పేరు సంపాదించుకోవడం విశేషం. తాజాగా పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మళ్లీ ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమా విజయంతో త్రిషాకు మళ్లీ వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్‌తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది త్రిష. త్రిష కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమా ఒకటి. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించింన విషయం తెలిసిందే. లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
Watched AMAV after a long time. Had a great time working with venky and @trishtrashers ..don’t mind making a sequel.
— selvaraghavan (@selvaraghavan) July 12, 2013
అయితే ఈ సినిమాపై దర్శకుడు సెల్వరాఘవన్ గతంలో ఓ ట్వీట్ చేశారు. 2013లో సెల్వ రాఘవన్ ట్వీట్ చేస్తూ.. ‘చాలా రోజుల తర్వాత ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’ చూశాను. వెంకటేశ్, త్రిషలతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతినిచ్చింది. దీని సీక్వెల్ తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ వాళ్లిద్దరినీ ట్యాగ్ చేశారు.
I’m ready @selvaraghavan 😝 https://t.co/9DCojSHe3u
— Trish (@trishtrashers) September 10, 2023
అయితే ఈ ట్వీట్ చేసిన దాదాపు 10 ఏళ్ల తర్వాత త్రిష స్పందించింది. తాజాగా సదరు ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘నేను కూడా సీక్వెల్‌ల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని స్పందించారు. దీంతో ప్రస్తుతం త్రిష చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 10 ఏళ్ల తర్వాత ట్వీట్‌కు రిప్లై ఇవ్వడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇంత త్వరగా స్పందించారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై దర్శకుడు ఎలా స్పందిస్తారు.? వెంకటేష్ సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధంగా ఉంటారా.? అన్న విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..