Pushpa 2: ‘పుష్పగాడు’ వచ్చేస్తున్నాడోచ్‌.. రిలీజ్‌ తేదీని అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్‌

ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. పుష్ప చిత్రం సృష్టించిన సంచలనం కారణంగా 'పుష్ప 2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యావత్ దేశం ఈ సినిమా కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. దీంతో సుకుమార్‌ ఈ సినిమాపై మరింత దృష్టి సారించాడు. ఇందులో భాగంగానే సినిమాను ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల పుష్ప సీక్వెల్‌కు సంబంధించి విడుదలైన టీజర్‌ సైతం ప్రేక్షకులను...

Pushpa 2: 'పుష్పగాడు' వచ్చేస్తున్నాడోచ్‌.. రిలీజ్‌ తేదీని అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్‌
Pushpa 2 Release Date
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 11, 2023 | 5:01 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే యావత్ ఇండియన్‌ సినిమా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సినిమా ‘పుష్ప2 ది రూల్‌’. సుకుమార్‌ దర్శకత్వంలో, అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’ ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఒక్కసారి షేక్‌ చేసింది. రికార్డులతో పాటు కలెక్షన్ల సునామీని కురిపించింది. ఎర్ర చందనం బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక పుష్ప ది రైజ్‌ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రం చందనం సిండికేట్‌కు ఎలా అధిపతిగా మారాడే దర్శకుడు చూపించాడు.

ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. పుష్ప చిత్రం సృష్టించిన సంచలనం కారణంగా ‘పుష్ప 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యావత్ దేశం ఈ సినిమా కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. దీంతో సుకుమార్‌ ఈ సినిమాపై మరింత దృష్టి సారించాడు. ఇందులో భాగంగానే సినిమాను ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల పుష్ప సీక్వెల్‌కు సంబంధించి విడుదలైన టీజర్‌ సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పుష్ప సీక్వెల్‌పై అమంతం అంచనాలను పెంచేసింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే పుష్ప2: ది రూల్‌ విడుదల తేదీన చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 2024 ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పుష్ప సీక్వెల్‌ విడుదల తేదీని దాదాపు ఏడాది ముందు ప్రకటించడం విశేషం. ఇంత టైమ్‌ తీసుకుంటేనే అర్థమవుతోంది సుకుమార్‌ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో. ఇక పుష్ప సీక్వెల్‌ రిలీజ్‌ డేట్‌పై అధికార ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతుంటే, మరికొందరు మాత్రం ఇంకా 11 నెలలు ఎదురు చూడాలా అని ఢీలా పడుతున్నారు.

ఇదిలా ఉంటే పుష్పతో బన్నీకి ఎలాంటి క్రేజ్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. తగ్గేదేలే అంటూ యావత్ దేశాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు బన్నీ. ఈ సినిమాలో తన అద్భుత నటనకు దేశమే ఫిదా అయ్యింది. ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకునే స్థాయికి బన్నీ చేరుకున్నాడు. 69 ఏళ్ల సినిమా చరిత్రలో తెలుగు నుంచి తొలిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని బన్నీ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మరి పుష్ప2 మరెన్ని వండర్స్‌ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరో ఏడాది ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!