- Telugu News Photo Gallery Cinema photos Bollywood first mbbs actress supermodel aditi govitrikar who won mrs world title in 2001 Telugu News
భారతదేశపు మొట్ట మొదటి మిసెస్ వరల్డ్ విజేత.. బాలీవుడ్ ఫస్ట్ లేడీ డాక్టర్ కూడా.. ఆమె అందంతో..
బాలీవుడ్‌లో ఎంతో మంది బాగా చదువుకున్న నటీమణులు ఉన్నారు. అయితే, శారీరక సౌందర్యంతో పాటు మానసిక సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందిన అనేక మంది నటీనటులు కూడా ఉన్నారు. అలాంటివారిలో ఒకరు బాలీవుడ్ నటి MBBS గ్రాడ్యుయేట్, భారతదేశపు మొట్టమొదటి శ్రీమతి వరల్డ్ విజేత. అంతేకాదు..ఆమె ప్రముఖ గైనకాలజిస్ట్, బాలీవుడ్, టీవీ పరిశ్రమలో కూడా ప్రముఖురాలు. ఈ సూపర్ మోడల్ ఎవరనే సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Sep 11, 2023 | 7:44 PM

అదితి గోవిత్రికర్.. భారతదేశపు మొదటి మిసెస్ వరల్డ్. ఆమె బాలీవుడ్ మొదటి MBBS నటి కూడా. అదితి గోవిత్రికర్ మే 21, 1976న మహారాష్ట్రలోని పన్వెల్‌లో జన్మించారు. ఆమె ముంబైలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలో 1997లో MBBS పూర్తి చేసింది. గోవిత్రికర్ గైనకాలజీలో MS పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ ప్రారంభించింది.

అదితి 1996లో గ్లాడ్రాగ్స్ మెగామోడల్ పోటీలో గెలుపొందింది. దీంతో ఆమె గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టంది.. పాండ్స్, కయా స్కిన్ క్లినిక్, కోకాకోలా వంటి బ్రాండ్‌ల కోసం అదితి హృతిక్ రోషన్‌తో పాటు పలు వాణిజ్య ప్రకటనలలో కూడా నటించింది.

అదితి గోవిత్రికర్ 2001లో మిసెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. భారత్‌కు ఇదే తొలి మిస్ వరల్డ్ కిరీటం. దీని తర్వాత ఆమె 2002లో సోచ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె నటన మొదట '16 డిసెంబర్'లో అందరి దృష్టిని ఆకర్షించింది.

అంతేకాకుండా, అదితి గోవిత్రికర్ బాజ్, పహేలీ, భేజా ఫ్రై, దే దానదన్, హమ్ తుమ్ ఔర్ షబానాలో కూడా నటించారు. అయితే, ఈ చిత్రాలన్నింటిలో ఆమె కేవలం సహాయక పాత్రలలో మాత్రమే కనిపించింది. అతి తక్కువ చిత్రాలలో అదితి ప్రధాన పాత్రలో నటించింది.

అదితి రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3లో భాగం. ఇది కాకుండా, ఆమె ఖత్రోన్ కే ఖిలాడీలో కనిపించింది. అనేక టీవీ సీరియల్స్‌లో పనిచేసింది. అదితి ముఫజల్ లక్డావాలాను వివాహం చేసుకుంది.

అదితి గోవిత్రికర్ తన మెడికల్ స్కూల్ సీనియర్ క్లాస్‌మేట్ ముఫజల్ లక్డావాలాను 7 సంవత్సరాల డేటింగ్ తర్వాత 1998లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అదితి ఇప్పుడు ముఫజల్ నుండి విడాకులు తీసుకుంది.

అదితికి ఇద్దరు పిల్లలు..వారు కియారా, జియాన్.




