Acharya: మెగాస్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్! అతిథులెవరో తెలుసా?
Acharya Pre Release Event: పెద్ద సినిమాలు ఒక్కొక్కటి విడుదల అవుతుండడంతో టాలీవుడ్ కళకళలాడుతోంది. భీమ్లానాయక్, రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్ ఇలా పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రెండు వారాల గ్యాప్‌తో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Acharya Pre Release Event: పెద్ద సినిమాలు ఒక్కొక్కటి విడుదల అవుతుండడంతో టాలీవుడ్ కళకళలాడుతోంది. భీమ్లానాయక్, రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్ ఇలా పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రెండు వారాల గ్యాప్‌తో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా ఈనెలలో కూడా కొన్ని ప్రతిష్ఠాత్మక చిత్రాలు సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటించిన గని ఈరోజు (ఏప్రిల్8) న విడుదల కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మరుసటి రోజే (ఏప్రిల్14) పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఆ తర్వాత మళ్లీ మెగా హంగామా మొదలుకానుంది. అదే చిరంజీవి నటించిన ఆచార్య (Acharya). కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, కాజోల్, పూజాహెగ్డే నటిస్తున్నారు. ఏప్రిల్ 29న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను విస్తృతం చేసే పనిలో ఉంది చిత్రబృందం.
పవర్ స్టార్ గెస్ట్ గా..
కాగా ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే తేదీని, వేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఏప్రిల్ 24న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ మైదానంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు అతిథులుగా రావొచ్చనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కాగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఆచార్య చిత్రాన్ని నిర్మించారు. సోనూసూద్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
Also Read: House Loan: మరింత కాలం చౌకగా హోమ్ లోన్స్.. RBI ప్రకటనతో రియల్టీ జోరు
IPL 2022: దినేశ్ కార్తీక్ మళ్లీ టీమ్ ఇండియాకి తిరిగి వస్తాడు.. ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ కోచ్..!
Early Dinner Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రి భోజనం ఇలా చేయండి..