Yami Gautam: ‘నన్ను దిగజార్చాలని చూస్తున్నారు, నా హృదయం ముక్కలయ్యింది’.. ఆవేదన వ్యక్తం చేసిన బాలీవుడ్ బ్యూటీ.
Yami Gautam: సినీ తారలకు ప్రశంసలు దక్కడం ఎంత సర్వసాధారణమో, విమర్శలు ఎదురు కావడం కూడా అంతే కామన్. అయితే చాలా సందర్భాల్లో తారలు విమర్శలను పెద్దగా పట్టించుకోరు. కానీ విమర్శలు హద్దు మీరితే మాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా సినిమా..
Yami Gautam: సినీ తారలకు ప్రశంసలు దక్కడం ఎంత సర్వసాధారణమో, విమర్శలు ఎదురు కావడం కూడా అంతే కామన్. అయితే చాలా సందర్భాల్లో తారలు విమర్శలను పెద్దగా పట్టించుకోరు. కానీ విమర్శలు హద్దు మీరితే మాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా సినిమా రివ్యూ (Movie Reviews)లో భాగంగా నటీనటలు యాక్టింగ్ గురించి ఎవరికి తోచిన కథనాలు వారు రాస్తుంటారు. అయితే వీటిని చాలా మంది యాక్టర్ పట్టించుకోరు. తమ పని తాను చేసుకుంటూ పోతుంటారు. కానీ తాజాగా బాలీవుడ్ (Bollywood) బ్యూటీ యామీ గౌతమ్ (Yami Gautam) మాత్రం తనపపై వచ్చిన ఓ కథనం విషయంలో హర్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ నటించిన తాజా చిత్రం దస్వీ. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన నేరుగా ఓటీటీ (OTT) వేదికగా విడుదలైంది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ మూవీ రివ్యూను రాసుకొచ్చింది. ఇందులో యామీ నటనను ప్రస్తావిస్తూ.. ఆమె నటిగా ఈ సినిమాలో పర్వాలేదని, గతంలో యామీ నటన విషయంలో ఫెయిల్ అయ్యిందన్న అర్థం వచ్చేలా కథనం ఉంది. ఈ ఆర్టికల్ కాస్త యామీ దృష్టికి వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా సదరు వెబ్‌సైట్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది బ్యూటీ. ఈ విషయమై వరుస ట్వీట్స్ చేసిన యామీ.. ‘నేనూ విమర్శలను తీసుకుంటున్నారు. వాటికి అనుగుణంగా నా తప్పొప్పులను సరి చేసుకుంటాను. కానీ నన్ను కావాలనే టార్గెట్ చేస్తూ, దిగజార్చాలని చూస్తున్నారు.
Before I say anything else, I’d like to say that I usually take constructive criticism in my stride. But when a certain platform keeps trying to pull you down consistently, I felt it necessary to speak up about it. https://t.co/GGczNekBhP pic.twitter.com/wdBYXyv47V
— Yami Gautam Dhar (@yamigautam) April 7, 2022
ఈ విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. నేను నటిగా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతగానో కష్టపడ్డాను. ఈ రివ్యూ చూసి నా హృదయం ముక్కలైంది’ అంటూ రాసుకొచ్చింది. ఇక సదరు వెబ్‌సైట్‌ను ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు ఆ సైట్‌ను ఫాలో అయ్యేదాన్నని, కానీ ఇప్పటి నుంచి ఆ అవసరం లేదనిపిస్తోందని తెలిపింది. దయ చేసి నా నటన గురించి ఇకపై రివ్వ్యూ ఇవ్వకండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో యామీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బార్బీ డాల్ ఫోజులతో ఫిదా చేస్తున్న వర్షిణి
Telangana: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మరో సారి బస్ ఛార్జీలను భారీగా పెంచిన TS RTC