Balakrishna: ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఇంతవరకు ఎప్పుడూ చూడని బాలయ్యను చూడబోతున్నారు..
అందుకే యువత కూడా బాలకృష్ణ సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇక కేవలం హీరోగా మాత్రమే కాకుండా అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. మరోవైపు ఓటీటీలో టాక్ షోతో తనలోని మరో కోణాన్ని సైతం పరిచయం చేశారు. తనదైన ఛలోక్తులు, పంచ్‌లు, ఇంట్రెస్టింగ్ ప్రశ్నలతో టాక్ షోని సక్సెస్ ఫుల్ చేశారు.
నట సింహం బాలకృష్ణ.. ఈ పేరు అంటేనే ఓ బ్రాండ్. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నందమూరి తారక రామరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తన సొంత గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించి అశేష అభిమానులను సంపాదించుకున్నారు. మారిన కాలంతో పాటు పాత్రల్లో వైవిధ్యాన్ని కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టే బాలకృష్ణకు ఇప్పటికీ ఫాలోయింగ్ కొనసాగుతోంది.
అందుకే యువత కూడా బాలకృష్ణ సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇక కేవలం హీరోగా మాత్రమే కాకుండా అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. మరోవైపు ఓటీటీలో టాక్ షోతో తనలోని మరో కోణాన్ని సైతం పరిచయం చేశారు. తనదైన ఛలోక్తులు, పంచ్‌లు, ఇంట్రెస్టింగ్ ప్రశ్నలతో టాక్ షోని సక్సెస్ ఫుల్ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య మరో అద్బుతానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కెరీర్‌లో ఎన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ సూపర్ హీరో రోల్‌లో నటించనున్నారని సమాచారం. ఇండియన్ సినిమా గతిని మార్చేలా ఈ సరికొత్త పాత్ర ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి అక్టోబర్ 11వ తేదీన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో క్యూరియాసిటీ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ముఖ్యంగా ఫ్యాన్స్ అంచనాలకు అంతే లేకుండా పోయింది. ఇంతకీ బాలయ్య పోషించబోయే ఆ సూపర్ హీరో పాత్ర ఏంటి.? ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గతిమార్చేంత ఆ పాత్రలో ఏముంది.? అన్న వార్తలు ఆసక్తిని పెంచేశాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..