Chiranjeevi: మరో సినిమాను పట్టాలెక్కించనున్న మెగాస్టార్‌.. పవర్‌ ఫుల్ డాన్‌ పాత్రలో చిరు..

సైరా నర్సింహా రెడ్డి తర్వాత చాలా రోజులు గ్యాప్‌ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్యతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత గ్యాప్‌ లేకుండా ఉండాలని ఫిక్స్‌ అయిన చిరు అభిమానుల కోసం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను...

Chiranjeevi: మరో సినిమాను పట్టాలెక్కించనున్న మెగాస్టార్‌.. పవర్‌ ఫుల్ డాన్‌ పాత్రలో చిరు..
Chiranjeevi New Movie
Follow us

|

Updated on: Oct 01, 2022 | 4:08 PM

సైరా నర్సింహా రెడ్డి తర్వాత చాలా రోజులు గ్యాప్‌ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్యతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత గ్యాప్‌ లేకుండా ఉండాలని ఫిక్స్‌ అయిన చిరు అభిమానుల కోసం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఒకేసారి ఏకంగా మూడు చిత్రాలను లైన్‌లో పెట్టారు. వీటిలో ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం అక్టోబర్‌ 5న దసరా కానుకగా విడుదలవుతోన్న విషయం తెలిసిందే. వీటితో పాటు భోళాశంకర్‌, వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలు ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోకముందే చిరంజీవి మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. గాఢ్‌ ఫాదర్‌తో మలయాళ సినిమాను రీమేక్‌ చేసిన మెగాస్టార్‌ ఈ సారి ఓ స్పానిష్‌ థ్రిల్లర్‌ను రీమేక్‌ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇక చిరు కెరీర్‌లోనే తొలిసారి ఓ డాన్‌ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. స్పానిష్‌లో తెరకెక్కిన ఈ సినిమా కథ.. రిటైర్‌ అయిన ఓ డాన్‌ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి చూపు చిరు గాడ్‌ ఫాదర్‌పై పడింది. సూపర్‌ హిట్ మూవీ లూసిఫర్‌ రీమేక్‌, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార చిరుకి సిస్టర్‌ రోల్‌లో నటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..