Rashmika Mandanna: విజయ్‍తో డేటింగ్ రూమర్స్ పై మరోసారి రష్మిక కామెంట్స్.. ఇదంతా చాలా క్యూట్‏గా ఉందంటూ..

ప్రస్తుతం ఆమె నటించిన హిందీ చిత్రం గుడ్ బై ప్రమోషన్లలో బిజీగా ఉంది నేషనల్ క్రష్. ఈ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా విజయ్ సినిమా లైగర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Rashmika Mandanna: విజయ్‍తో డేటింగ్ రూమర్స్ పై మరోసారి రష్మిక కామెంట్స్.. ఇదంతా చాలా క్యూట్‏గా ఉందంటూ..
Rashmika Mandanna Vijay
Follow us

|

Updated on: Oct 01, 2022 | 2:13 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నిత్యం ఆమెకు సంబంధించిన వార్త నెట్టింట వైరలవుతుంది. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. గతంలో రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తమపై వస్తున్న పుకార్లపై ఇటీవల లైగర్ ఈవెంట్లో స్పందించారు విజయ్. కేవలం తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని కుండబద్దలు కొట్టేశారు. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించింది రష్మిక. ప్రస్తుతం ఆమె నటించిన హిందీ చిత్రం గుడ్ బై ప్రమోషన్లలో బిజీగా ఉంది నేషనల్ క్రష్. ఈ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా విజయ్ సినిమా లైగర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

” విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించాను. దీంతో మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. దీంతో మా ఇద్దరి గురించి అందరూ మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల విజయ్ నటించిన లైగర్ సినిమాను చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. విజయ్ ఈసినిమాలో అదరగొట్టేశాడు. ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వెల్ డన్ విజయ్” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో పుష్ప 2.. తమిళంలో విజయ్ దళపతి సరసన వరిసు.. హిందీలో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్, మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటిస్తుంది. ఇక బిగ్ బీ అమితాబ్, రష్మిక కలిసి నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తున్నాడు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..