Megastar Chiranjeevi: ‘రాజమౌళితో సినిమా అస్సలు చేయను.. కారణమిదే’.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక తనకు లేదంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాకుండా ఒక పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

Megastar Chiranjeevi: 'రాజమౌళితో సినిమా అస్సలు చేయను.. కారణమిదే'.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..
Megastar Chiranjeevi, Rajam
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 01, 2022 | 10:19 AM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సత్తా చాటుతుంది. జక్కన్న స్క్రీన్ ప్లై పై హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ఆయన దర్శకత్వంలో ఒక్కసారైన నటించాలని కోరకుంటారు ప్రతి ఒక్కరు నటీనటులు. అలాంటిది రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక తనకు లేదంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. జక్కన్న అంటే తనకు ఇష్టమని.. అయిన తనతో సినిమా చేయాలని లేదన్నారు. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్‏గా వస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ కీలకపాత్రలలో నటించడంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రాజమౌళితో పనిచేయనని ఇటీవల అన్నారు . కదా ఎందుకు ? అని యాంకర్ ప్రశ్నించగా.. చిరు స్పందిస్తూ.. ” రాజమౌళి గొప్ప డైరెక్టర్. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి తెలిపారు. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చూస్తారు. ఆయన కోరుకునే ఔట్‏పుట్‏ను నటుడిగా నేను ఇవ్వగలనా లేదా అనేది నాకు తెలియదు. సినిమా తెరకెక్కించడానికి తను ఎంత సమయం వెచ్చిస్తారో తెలిసిందే. దాదాపు మూడు నుంచి ఐదు సంవత్సరాలు సినిమా కోసం సమయం తీసుకుంటారు. కానీ నేను ఓకే సంవత్సరంలో నాలుగైదు సినిమాలు చేస్తున్నాను. అందుకే ఆయనతో పనిచేయాలని.. పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందాలనిలేదు.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ మాత్రమే కాకుండా.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన గాడ్ ఫాదర్ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

నకిలీ ED రైడ్స్‌ .. గ్యాంగ్‌ మూవీ సీన్‌ దింపేశారుగా.! కట్‌ చేస్తే
నకిలీ ED రైడ్స్‌ .. గ్యాంగ్‌ మూవీ సీన్‌ దింపేశారుగా.! కట్‌ చేస్తే
ఏపీ కేబినెట్‌లో నాగబాబుకు ఆ శాఖే ఇస్తారట.! వీడియో..
ఏపీ కేబినెట్‌లో నాగబాబుకు ఆ శాఖే ఇస్తారట.! వీడియో..
MRNA కొవిడ్‌ టీకాలతో మరణించే ముప్పు.. కోట్లమందిలో కొత్త టెన్షన్‌!
MRNA కొవిడ్‌ టీకాలతో మరణించే ముప్పు.. కోట్లమందిలో కొత్త టెన్షన్‌!
కారు దిగి పారిపోతున్నవారిని పట్టుకున్న పోలీసులు.. తీరా చూస్తే!
కారు దిగి పారిపోతున్నవారిని పట్టుకున్న పోలీసులు.. తీరా చూస్తే!
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
భర్తకు నిద్రమత్తుతో డ్రైవింగ్ సీటులోకి భార్య.. ఇంతలోనే షాక్.!
భర్తకు నిద్రమత్తుతో డ్రైవింగ్ సీటులోకి భార్య.. ఇంతలోనే షాక్.!
భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్లు తాగితే ఏమౌతుంది.? వీడియో..
భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్లు తాగితే ఏమౌతుంది.? వీడియో..
రైతులు, యువత హక్కులను కాలరాస్తున్నారుః రాహుల్
రైతులు, యువత హక్కులను కాలరాస్తున్నారుః రాహుల్
ఇక్కడ టమోటా ధరను మీరు అస్సలు ఊహించలేరు.! వీడియో..
ఇక్కడ టమోటా ధరను మీరు అస్సలు ఊహించలేరు.! వీడియో..
ఈ టైమ్‌లో అరటిపండు అస్సలు తినకండి.! నిపుణుల సలహా ఏంటంటే.?
ఈ టైమ్‌లో అరటిపండు అస్సలు తినకండి.! నిపుణుల సలహా ఏంటంటే.?