AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ‘ఆర్ఆర్ఆర్‏కు ఆస్కార్ అవసరం లేదు’.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రష్మిక..

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో ఈ సినిమా ఆస్కార్‏కు నామినేట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడగా.. చివరి నిమిషంలో చెల్లో షో వెళ్లింది. తాజాగా ఈ విషయంపై స్పందించింది రష్మిక మందన్నా.

Rashmika Mandanna: 'ఆర్ఆర్ఆర్‏కు ఆస్కార్ అవసరం లేదు'.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రష్మిక..
Rrr, Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2022 | 10:59 AM

Share

సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందింది. అంతేకాకుండా భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం హీందీలో ఆమె నటించిన గుడ్ బై సినిమా ప్రమోషన్లలో పాల్గోంటుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న నేషనల్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ కాకపోవడంపై స్పందించింది.

“ఆర్ఆర్ఆర్ సినిమాకు లభించిన ప్రేమ అన్నింటికంటే పెద్ద విజయం. ప్రస్తుతం ఎలాంటి భేదాలు లేకుండా సినిమాను మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది సంతోషించాల్సిన విషయం. గతంలో నేను నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం కూడా ఆస్కార్ నామినేషన్ కోసం పరిశీలనకు వెళ్లింది. కాకపోతే ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లలేదు. కానీ ఆర్ఆర్ఆర్ అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ మూవీపై అభిమానాన్ని చూపించారు. ఈ సినిమాకు భారీగా వసూళ్లు రావడమే కాకుండా.. ప్రేకక్షులను మెప్పించింది. ఈ విషయాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి.” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమా ఈ ఏడాది ఆస్కార్‏కు వెళ్లే అవకాశం ఉందని హాలీవుడ్ మ్యాగజైన్స్, సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ చివరి నిమిషంలో ఆర్ఆర్ఆర్ కాకుండా గుజరాతీ ప్రాంతీయ చిత్రం చెల్లో షో ఆస్కార్ అవార్డుకు వెళ్లింది.

Follow Us
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్
ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్