Salman Khan: సల్మాన్ ఖాన్ డూప్ కన్నుమూత.. ఎమోషనల్ అయిన హీరో

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కూడా డూప్ ఉన్నాడు. సాగర్ పాండే అనే వ్యక్తి సల్మాన్ ఖాన్ కు డూప్ గా చేస్తూ ఉంటాడు.

Salman Khan: సల్మాన్ ఖాన్ డూప్ కన్నుమూత.. ఎమోషనల్ అయిన హీరో
Salman Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 01, 2022 | 11:22 AM

స్టార్ హీరోలకు చాలా మందికి డూప్ లు ఉంటారు. యాక్షన్ సీన్స్ లో చాలా వరకు డూప్స్ లో కనిచేస్తుంటారు. అచ్చం ఆ హీరోల ఉండేలా మరో వ్యక్తితో చాలా సీన్స్ చేయించేస్తారు. బాలీవుడ్ లో చాలా మందికి ఇలా డూప్స్ ఉన్నారు. అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కూడా ఓ డూప్ ఉన్నాడు. సాగర్ పాండే అనే వ్యక్తి సల్మాన్ ఖాన్ కు డూప్ గా చేస్తూ ఉంటాడు. సాగర్ పాండే పర్సనాలిటీ , హెయిర్ స్టైల్ అంతా సేమ్ టు సేమ్ సల్మాన్ ను పోలి ఉంటుంది. తాజాగా సాగర్ పాండే గుండె పోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం అతని వయసు 50 ఏళ్లు. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో సాగర్ పాండే కన్నుమూశారు. దాంతో బాలీవుడ్ స్టార్స్ సాగర్ పాండే మృతికి సంతాపం తెలుపుతున్నారు.

ఇక సల్మాన్ కూడా సోషల్ మీడియా వేదికగా సాగర్ పాండే మృతికి సంతాపం తెలిపారు. సాగర్ పాండే ఫోటోను షేర్ చేసిన సల్మాన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ” నాతో ఉన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సాగర్ పాండే..” అంటూ సల్మాన్ ఇన్‌స్టా‌గ్రామ్ లో రాసుకొచ్చారు. సాగర్ పాండే సల్మాన్ ఖాన్‌తో చాలా సినిమాలకు పనిచేశారు.

ఇవి కూడా చదవండి

‘బజరంగీ భాయిజాన్’, ‘ట్యూబ్‌లైట్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘దబాంగ్’, ‘దబాంగ్ 2’లాంటి సినిమాల్లో సల్మాన్ తో కలిసి నటించారు సాగర్ పాండే. ఇక కరోనా సమయంలో ఆఫర్స్ లేకపోవడంతో సాగర్ పాండే ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తనకు ఆర్ధికంగా సాయం చేశారని.. ప్రతినెలా డబ్బులు పంపారని గతంలో ఓ ఇంట్రవ్యూలో సాగర్ పాండే తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.