Maja Ma Song: గుడ్ బై మూవీ ప్రమోషన్ కోసం బుల్లి తెరపై సందడి చేసిన రష్మిక.. మాధురీ దీక్షిత్ తో సాంగ్ కు డ్యాన్స్..

మాధురీ దీక్షిత్ తన రాబోయే చిత్రం మజా మా నుండి బూమ్ పడి బీట్‌లకు .. మాధురి, రష్మికలు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మాధురీ దీక్షిత్, “రష్మిక మందన్నతో మజా మా” అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేశారు.

Maja Ma Song: గుడ్ బై మూవీ ప్రమోషన్ కోసం బుల్లి తెరపై సందడి చేసిన రష్మిక.. మాధురీ దీక్షిత్ తో సాంగ్ కు డ్యాన్స్..
Rashmika And Madhuri Dixit
Follow us
Surya Kala

|

Updated on: Sep 30, 2022 | 5:27 PM

బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌ అందంతో పాటు డ్యాన్స్ తో అభిమానులను అలరించింది. పెళ్లి చేసుకున్న అనంతరం వెండి తెరకు తాత్కాలికంగా విరామం ఇచ్చిన మాధురీ.. బుల్లి తెరపై మాత్రం పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే ఉన్నారు. యంగ్ హీరో యిన్ రష్మిక మందన్న పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. వరస ఆఫర్స్ ను అందుకుని బిజిబిజీ అయిపోయింది.  రష్మిక నటించిన గుడ్ బై మూవీ త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో మాధురి దీక్షిత్ జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జా 10లో రష్మిక మందన్న కనిపించింది. ఈ షోలో న్యాయనిర్ణేతలలో ఒకరైన మాధురీ దీక్షిత్, కరణ్ జోహార్, నోరా ఫతేహి లతో పాటు రష్మిక సందడి చేసింది. మాధురీ దీక్షిత్ తన రాబోయే చిత్రం మజా మా నుండి బూమ్ పడి బీట్‌లకు .. మాధురి, రష్మికలు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మాధురీ దీక్షిత్, “రష్మిక మందన్నతో మజా మా” అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

మాధురీ దీక్షిత్ ఆనంద్ తివారీ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మజా మా” సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో గజరాజ్ రావ్, బర్ఖా సింగ్, షీబా చద్దా , సృష్టి శ్రీవాస్తవ కూడా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన మజా మా ట్రైలర్ ఫ్యామిలీ డ్రామాతో .. చాలా సరదాగా ఉంది. దీన్ని గత వారం మాధురీ దీక్షిత్ షేర్ చేశారు.

“ఒక పెళ్లి, రహస్యం, వేరుగా ఉన్న రెండు కుటుంబాలు! ఈ పండుగ సీజన్ మరింత ఆనందాన్ని ఇస్తుందా..!  ట్రైలర్  ముగిసింది! అక్టోబర్ 6న ప్రైమ్‌లో మజా మాని చూడండి.” అని ఆ ట్రైలర్ కు ఆసక్తికరమైన కొటేషన్స్ ను జత చేసింది మాధురి. మజా మా అక్టోబర్ 6న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది.

ఇదిలా ఉంటే, రష్మిక మందన్న యొక్క గుడ్‌బై అక్టోబర్ 7న థియేటర్లలోకి రానుంది. అమితాబ్ బచ్చన్ , నీనా గుప్తా కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..