AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: ‘అమ్మాయిలతో రొమాన్స్ ఇష్టమా. గన్ ఫైరింగ్ ఇష్టమా’.. రిపోర్టర్ ప్రశ్నకు నాగార్జున ఆన్సర్ అదిరిపోయిందిగా..

ది ఘోస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‏లో విలేకరి అడిగిన ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు నాగార్జున. దీంతో ఒక్కసారిగా అందరూ కేకలు వేశారు. ఇంతకీ ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నేంటీ ?.. నాగ్ ఏమని సమాధానం ఇచ్చారో తెలుసుకుందామా.

Akkineni Nagarjuna: 'అమ్మాయిలతో రొమాన్స్ ఇష్టమా. గన్ ఫైరింగ్ ఇష్టమా'.. రిపోర్టర్ ప్రశ్నకు నాగార్జున ఆన్సర్ అదిరిపోయిందిగా..
Akkineni Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2022 | 11:36 AM

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అంతేకాకుండా పీఎస్వీ గరుడవేగ, స్పై వంటి యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారుతో నాగార్జున సినిమా చేస్తుండడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‏మీట్‏లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు నాగార్జున సమాధానాలు ఇచ్చారు.

ఓ విలేకరి మాట్లాడుతూ.. స్క్రీన్ మీద మీకు అమ్మాయిలతో రొమాన్స్ ఇష్టమా ?.. లేదా గన్‏తో ఫైరింగ్ ఇష్టమా ? అని ప్రశ్నించారు. దీనికి నాగార్జున నవ్వేశారు. మరోసారి ప్రశ్న అడగమని చెప్పి.. నవ్వుతూ.. “ఒక చేతిలో గన్ను.. మరో చేతిలో అమ్మాయి అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. అలాగే.. ది ఘోస్ట్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ ని కూడా ప్రవీణ్ అద్భుతంగా కట్ చేశారు. ఒక కాన్సెప్ట్ తో వున్న కంటెంట్ ఇది. సినిమా కోసం చాలా ఎక్సయిట్ గా ఎదురుచూస్తున్నాం. సాంకేతిక నిపుణుల, నటీనటులు పనితనం గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. అనంతపురం ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమాకి బెస్ట్ విషెస్ అందించడం చాలా అనందంగా వుంది. చిరంజీవి గారికి కృతజ్ఞతలు. విడుదలౌతున్న అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి. ఈ సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాలని” అన్నారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా.. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో