AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సోషల్ మీడియా బయో మార్చిన సమంత.. ఏమని రాసిందంటే ?..

సోషల్ మీడియాలో సమంత మళ్లీ యాక్టివ్ అయ్యింది. కొద్దిరోజులుగా కేవలం సినిమా అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తున్న సామ్.. తాజాగా తన ఇన్ స్టా బయో మార్చింది. ఇంతకీ సామ్ ఏమని రాసిందో తెలుసుకుందామా.

Samantha: సోషల్ మీడియా బయో మార్చిన సమంత.. ఏమని రాసిందంటే ?..
Samantha 1
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2022 | 12:14 PM

Share

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన తర్వాత నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ.. మోటివేషనల్ కోట్స్.. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తుంది. భర్తతో విడిపోయిన అనంతరం ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపించారు. దీంతో ఆకస్మాత్తుగా సామ్ నెట్టింట్లో సైలెంట్ కావడంతో అనేక రూమర్స్ పుట్టుకొచ్చాయి. సామ్ అరుదైన స్క్రీన్ ప్రాబ్లమ్‏తో బాధపడుతుందని.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికాలో చికిత్స తీసుకునేందుకు త్వరలోనే వెళ్లనున్నట్లుగా వార్తలు హల్చల్ చేశాయి. దీంతో ఆమె ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడడం లేదంటూ సామ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా శాకుంతలం మూవీ అప్డేట్స్‏లో మళ్లీ యాక్టివ్ అయ్యింది సమంత. కేవలం మూవీ అప్డేస్ మాత్రమే షేర్ చేస్తున్న సామ్.. తాజాగా తన ఇన్ స్టా బయో మార్చింది.

“మీ సామర్థ్యాలు ఏమైనా.. మీరు వాటిని పరిమితికి మించి మరింత విస్తరించాలి ” అంటూ రాసుకొచ్చింది సామ్. అయితే ఇప్పుడు ఆమె మార్చిన బయో గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సామ్ తెలుగు, హిందీ మాత్రమే కాకుండా హాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న యాక్షన్ సిరీస్ సిటాడెల్‏లో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సిరీస్ అమెరికాలో షూటింగ్ జరగనుంది. ఇందులోని తన పాత్ర కోసం సామ్ చాలా కష్టపడుతుందని.. అందుకు తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకుంటుందని.. ఇక అందుకోసమే తన బయోను ఇలా మార్చిందంటూ నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు తెచ్చుకుంది సామ్.

Samantha

Samantha

అలాగే ప్రస్తుతం సమంత.. ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న యశోద, శాకుంతలం సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..