Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhi Pinisetty – Nikki Galrani: ఆది, నిక్కీల పెళ్లి వేడుకలో నాని, సందీప్‌ కిషన్‌.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన హీరోలు.. వీడియో వైరల్‌..

Aadhi Pinisetty - Nikki Galrani: ఈ పెళ్లి వేడుకల్లో న్యాచురల్‌ స్టార్‌ నాని, యంగ్‌ హీరో సందీప్ కిష‌న్‌ తదితరులు హాజరయ్యారు. ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోల నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

Aadhi Pinisetty - Nikki Galrani: ఆది, నిక్కీల పెళ్లి వేడుకలో నాని, సందీప్‌ కిషన్‌.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన హీరోలు.. వీడియో వైరల్‌..
Aadhi Pinisetty And Nikki G
Follow us
Basha Shek

|

Updated on: May 18, 2022 | 4:44 PM

Aadhi Pinisetty – Nikki Galrani: గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కోలీవుడ్‌ యంగ్ హీరో ఆది పినిశెట్టి, కన్నడ బ్యూటీ నిక్కీ గల్రాణి మరికొన్ని గంటల్లో ఏకం కానున్నారు. చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌ వేదికగా ఈ ప్రేమ పక్షుల వివాహం జరగనుంది. కాగా వీళ్ల ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఘనంగా జరుగుతున్నాయి. కాగా ఈ పెళ్లి వేడుకల్లో న్యాచురల్‌ స్టార్‌ నాని, యంగ్‌ హీరో సందీప్ కిష‌న్‌ తదితరులు హాజరయ్యారు. ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోల నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.  యాగవరాయినుం నా కాక్క అనే తమిళ సినిమాలో ఆదిపినిశెట్టి (Aadhi Pinisetty) సరసన నిక్కీ గల్రాణి (Nikki Galrani) నటించింది. ఈ చిత్రం తెలుగులో మలుపు పేరుతో విడుదలైంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే నిక్కీకి, ఆదితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే చాలా ఏళ్ల పాటు తమ ప్రేమను రహస్యంగానే ఉంచారు.

కాగా ఈ ఏడాది మార్చి 24న ఇరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారీ లవ్‌ బర్డ్స్‌. ఆ తర్వాత పెళ్లి విషయంపై కూడా సస్పెన్స్‌ కొనసాగించారు. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు ఓ ప్రెస్‌మీట్‌ నిర్వహించి తమ పెళ్లి వేడుకల గురించి అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆది ప్రస్తుతం ఎనర్జిటిక్‌ హీరో రామ్ హీరోగా న‌టిస్తున్న ది వారియ‌ర్‌లో ప్రతి నాయ‌కుడి పాత్రలో న‌టిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Road Accident: వరంగల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురి దుర్మరణం..

Nivetha Pethuraj : సినిమా ఛాన్స్‌లు రాకపోతే ఆ ఉద్యోగమైనా చేసుకుంటా.. నివేద ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

IPL 2022: విజయోత్సాహంలో గుజరాత్‌ ఆటగాళ్లు.. వై దిస్‌ కొలవెరి డి అంటూ రచ్చ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..