Road Accident: వరంగల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురి దుర్మరణం..

Warangal: పెళ్లి పనుల్లో భాగంగా సామానులు తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో గుగులోతు స్వామి, సీత, జాటోత్ బిచ్చమ్మ ప్రాణాలు కోల్పోగా..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాంతమ్మ, గోవింద్ కన్నుమూశారు.

Road Accident: వరంగల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురి దుర్మరణం..
Follow us
Basha Shek

|

Updated on: May 18, 2022 | 3:15 PM

Warangal: వరంగల్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఖానాపురం మండలం గ్రామ శివారులోని చిలుకమ్మనగర్ శివారు పర్శతండా వద్ద చెరువు కట్టపై వెళ్తున్న ట్రాక్టర్   ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ  ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెళ్లి పనుల్లో భాగంగా సామానులు తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో గుగులోతు స్వామి, సీత, జాటోత్ బిచ్చమ్మ ప్రాణాలు కోల్పోగా..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాంతమ్మ, గోవింద్ కన్నుమూశారు.

కాగా రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Hyderabad: గంటల ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు.. అసలు కారణమేంటంటే..

Delhi Police Recruitment 2022: ఢిల్లీ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల..ఇంటర్‌ అర్హత ఉంటే చాలు..

IPL 2022: ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ అట్టర్ ప్లాప్‌.. గందరగోళంలో టీమ్‌ ఇండియా పరిస్థితి..!