Gujarat – Wall Collapsed: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన గోడ.. 13 మంది మృతి..

Gujarat - Wall Collapsed: గుజరాత్‌లోని మోర్బి జిల్లా హల్వాద్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూడి 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దా

Gujarat - Wall Collapsed: గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన గోడ.. 13 మంది మృతి..
Collapse
Follow us
Shiva Prajapati

|

Updated on: May 18, 2022 | 1:29 PM

Gujarat – Wall Collapsed: గుజరాత్‌లోని మోర్బి జిల్లా హల్వాద్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూడి 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మందికిపైగా కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద మరికొంత మంది మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. శిథిలాలను తొలగించడానికి జేసీబీలు, మ్యాన్ పవర్‌ ఉపయోగిస్తున్నారు అధికారులు. క్షతగాత్రులును స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

కాగా, మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో చాలా మంది కూలీలు తినడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. లేదంటే.. చాలా మంది ఈ ప్రమాదంలో బాధితులయ్యేవారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కూలీలు.. స్థానిక రాధన్‌పూర్ సమీపంలోని వారిగా గుర్తించారు అధికారులు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?