Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గంటల ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు.. అసలు కారణమేంటంటే

వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే(Railway).. ప్రస్తుతం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సరైన సమయంలో బండ్లు నడపలేక, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చలేక తీవ్ర...

Hyderabad: గంటల ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు.. అసలు కారణమేంటంటే
Trains
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 18, 2022 | 3:11 PM

వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే(Railway).. ప్రస్తుతం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సరైన సమయంలో బండ్లు నడపలేక, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చలేక తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. పదేళ్ల కిందట దేశవ్యాప్తంగా ప్రతి రైలు నాలుగైదు గంటలు ఆలస్యంగా నడిచేది. ఇలా చూసుకుంటే ప్రస్తుతం అదే జరుగుతోన్నట్లు కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి రాజధాని నగరానికి చేరాల్సిన రైళ్లు సికింద్రాబాద్(Secunderabad) కు చేరడం లేదు. ఫలితంగా ప్యాసింజర్స్ రైళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గంటల కొద్దీ అందులోనే ఉండటంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల రైళ్లు ఇలా అర్థంతరంగా గంటల కొద్దీ ఆలస్యంగా నడవడంపై కారణాలను ఆరా తీయగా.. పలు షాకింగ్ విషయాలు తెలిశాయి. గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రయాణికుల రైళ్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. రైల్వేకు అధిక ఆదాయం తెచ్చిపెట్టే గూడ్స్ పైనే రైల్వే శాఖ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల రైళ్లను పట్టించుకోకుండా అధిక సంఖ్యలో గూడ్స్ రైళ్లు నడవడం వల్లే ఆ రైళ్లు ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది.

కరోనా సమయంలో రైల్వే శాఖ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్ల కంటే గూడ్సుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల ముందు వరకు రాజధాని నుంచి ప్రయాణికుల రైళ్లు అధికంగా తిరిగే సమయాల్లో అయిదారు గూడ్సు రైళ్లను మాత్రమే నడిపేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం రోజుకు 25 నుంచి 30 గూడ్సు రైళ్లను తిప్పుతున్నారు.

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి నిత్యం 170 వరకు సూపర్‌ఫాస్టు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ప్రయాణించే లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తమ సమస్యలపై దృష్టి సారించి, పరిష్కారానికి ప్రయత్నించాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

CM Jagan: నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.. కాటసాని కుమారుడి పెళ్లికి హాజరైన సిఎం జగన్..