Nivetha Pethuraj : సినిమా ఛాన్స్‌లు రాకపోతే ఆ ఉద్యోగమైనా చేసుకుంటా.. నివేద ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురం, రెడ్, పాగల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవల బ్లడ్‌ మేరీ సినిమాతో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ.

Nivetha Pethuraj :  సినిమా ఛాన్స్‌లు రాకపోతే ఆ ఉద్యోగమైనా చేసుకుంటా.. నివేద ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Nivetha Pethuraj
Follow us
Basha Shek

|

Updated on: May 17, 2022 | 10:09 PM

మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నివేదా పేతురాజ్‌. ఆతర్వాత సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి చిత్రలహరి సినిమాలో కనిపించింది. బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురం, రెడ్, పాగల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవల బ్లడ్‌ మేరీ సినిమాతో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ. చేసింది తక్కువ సినిమాలే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుందీ సొగసరి. అయితే సూపర్‌ హిట్‌మాత్రం ఈ అందాల భామకు దక్కలేదు. ఈక్రమంలో స్టార్‌ హీరోయిన్‌ అన్న ట్యాగ్‌పై స్పందించిన నివేద పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘ నాకు హీరోయిన్‌ కన్నా నటిగా అనిపించుకోవడమంటేనే గర్వంగా ఉంటుంది. హీరోయిన్‌గా సినిమాలు చేయకపోతే ఇక కెరీర్‌ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు మాత్రం అలాంటి భయం లేదు. కెరీర్‌కు సంబంధించి ఎలాంటి పరిధులు పెట్టుకోలేదు. నటనకు ప్రాధాన్యముంటే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. ఒకవేళ సినిమా అవకాశాలు రాకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది నివేద. కాగా దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి నటిస్తోన్న విరాట పర్వం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

IPL 2022: విజయోత్సాహంలో గుజరాత్‌ ఆటగాళ్లు.. వై దిస్‌ కొలవెరి డి అంటూ రచ్చ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Vijayasai Reddy: చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది.. ఆయనను తక్షణమే అరెస్ట్‌ చేయాలి.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

స్మోకింగ్ అలవాటున్న వారు ఈ ఆహార పదార్థాలు తప్పక తీసుకోవాల్సిందే.. ఎందుకంటే..