Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayasai Reddy: చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది.. ఆయనను తక్షణమే అరెస్ట్‌ చేయాలి.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

Vijayasai Reddy: కేబినెట్ మంత్రి హోదాను అడ్డం పెట్టుకుని ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ (ఐపీసీ)లోని అన్ని నేరాల‌కు చిదంబరం పాల్పడ్డారు. చేసిన త‌ప్పుల‌కన్నీ ఆయన ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన స‌మయం ఆసన్నమైంది.

Vijayasai Reddy: చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది.. ఆయనను తక్షణమే అరెస్ట్‌ చేయాలి.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
Follow us
Basha Shek

|

Updated on: May 17, 2022 | 9:47 PM

Vijayasai Reddy:  కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబ‌రం (P.chidambaram) పై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజ‌యసాయిరెడ్డి (Vijayasai Reddy) సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. చిదంబరంను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా పేర్కొన్న ఆయన.. త‌క్షణమే కేంద్ర మాజీ మంత్రిని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ట్విట్టర్‌ వేదిక‌గా వరుసగా ట్వీట్లు సంధించారు విజయసాయిరెడ్డి. ‘చిదంబ‌రం ఓ ఆర్థిక ఉగ్రవాది. ఆయ‌నకు నైతిక‌ విలువలు లేవు. న్యాయ క‌ళాశాల‌లు చిదంబ‌రం వ్యవహారాలను కేస్ స్టడీస్‌లుగా తీసుకోవాలి. మ‌నీ ల్యాండ‌రింగ్ నుంచి చైనా పౌరుల‌కు లంచాలు తీసుకుని వీసాలు ఇప్పించడం వరకు చిదంబ‌రం ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. కేబినెట్ మంత్రి హోదాను అడ్డం పెట్టుకుని ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ (ఐపీసీ)లోని అన్ని నేరాల‌కు చిదంబరం పాల్పడ్డారు. చేసిన త‌ప్పుల‌కన్నీ ఆయన ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన స‌మయం ఆసన్నమైంది. త‌క్షణమే చిదంబరంను అరెస్ట్ చేయాలి’ అని అరెస్ట్‌ చిదంబరం ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించారు వైసీపీ నేత.

ఇక ఆ తర్వాతి ట్వీట్‌లో ‘ 2004- 14 మ‌ధ్య కాలంలో కేంద్ర మంత్రి హోదాలో చిదంబ‌రం తీసుకున్న అన్ని నిర్ణయాలు, వ్యవహారాలపై విచార‌ణ చేప‌ట్టాలి’ అని డిమాండ్‌ చేశారు. ‘త‌న ప్రత్యర్థులపై త‌ప్పుడు కేసులు పెట్టించిన చిదంబ‌రం అత్యంత నిర్దయగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి అంతా తారుమారైంది. చిదంబ‌రం విత్తిన పాపం ఇప్పుడు ఫ‌లాలు ఇస్తోంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ చిదంబ‌రం కోట్లాది రూపాయలను అక్రమంగా పోగు చేశారు. ఇన్ని నేరాలకు పాల్పడ్డ చిదంబరం ఆర్థిక‌, రాజ‌కీయ అంశాల‌పై ధైర్యంగా ఎలా ఉప‌న్యాసాలు ఇస్తున్నారో నాకే మాత్రం అర్థం కావడం లేదు. చిదంబ‌రం పాల్పడ్డ అక్రమాల కార‌ణంగా ప్రభుత్వ ఖ‌జానాకు భారీ న‌ష్టం వాటిల్లింది. ధ‌నికుల కోసం పేద‌ల‌ను ద‌రిద్రంలో కూరుకుపోయేలా చిదంబ‌రం వ్యవహరించారు. కేంద్రమంత్రిగా ఉన్న కాలంలో దేశంలో అవినీతి అక్రమాలు, స్కాంలకు పాల్పడ్డ అంద‌రితోనూ చిదంబ‌రం ఒప్పందాలు కుదుర్చుకున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

IPL 2022: విజయోత్సాహంలో గుజరాత్‌ ఆటగాళ్లు.. వై దిస్‌ కొలవెరి డి అంటూ రచ్చ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

IPL 2022: ఈ 9 కోట్ల ఆటగాడు 16 కోట్ల స్టార్ ప్లేయర్ రికార్డును సమం చేశాడు..

Don OTT: అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టనున్న డాన్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..