Don OTT: అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టనున్న డాన్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

Don OTT: గతవారం ఏకకాలంలో త‌మిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ పాజిటివ్‌ రివ్యూలను తెచ్చుకుంది.

Don OTT: అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టనున్న డాన్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
Don
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 17, 2022 | 10:10 PM

Don OTT: గతంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన శివ కార్తికేయన్‌ (Shiva Karthikeyan) ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు. వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. అతను నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్‌ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈనేపథ్యంలో గతేడాది డాక్టర్‌ సినిమాతో అటు తమిళం, ఇటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్‌ హిట్‌ సాధించాడు. ఈక్రమంలోనే ఇప్పుడు డాన్‌ (Don) గా మన ముందుకు వచ్చాడు. సిబి.చ‌క్రవర్తి ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాలో శివ‌కార్తికేయ‌న్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహ‌న్ న‌టించింది. గతవారం ఏకకాలంలో త‌మిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ పాజిటివ్‌ రివ్యూలను తెచ్చుకుంది. మహేశ్‌ బాబు నటించిన సర్కారు వారి పాట పోటీ ఉన్నా డీసెంట్‌ కలెక్షన్లను సాధిస్తోంది. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ. 50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్‌ స్ర్కీన్‌ ప్రీమియర్‌కు సిద్ధమైందని సమాచారం.

ఈ మ‌ధ్య కాలంలో ఎంత‌టి భారీ విజ‌యం సాధించినా సినిమాలైన కేవ‌లం నెల రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. పుష్ప, భీమ్లానాయక్‌, రాధేశ్యామ్‌లు ఇలాగే ఓటీటీలో దర్శనమిచ్చాయి. ఈ క్రమంలోనే డాన్ చిత్రం కూడా విడుద‌లైన 4వారాల్లోనే డిజిటల్‌ స్ర్కీన్‌పై ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో జూన్ 10నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కాగా డాన్‌ సినిమాకు లేటెస్ట్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థతో క‌లిసి శివ కార్తికేయ‌న్ స్వీయ‌ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Tirupati: గంగమ్మ జాతరలో కత్తి పట్టిన సీఐ.. స్థానికులతో కలిసి చిందులు.. వైరలవుతోన్న వీడియో..

జీడితోటలో కలకలం.. అక్కడి సీన్‌ చూసి భయంతో కూలీలు పరుగులు..

TS Tenth Exams 2022: తెలంగాణ టెన్త్‌ పరీక్ష కేంద్రాల వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్‌ నంబర్లు.. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే..