AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: గంగమ్మ జాతరలో కత్తి పట్టిన సీఐ.. స్థానికులతో కలిసి చిందులు.. వైరలవుతోన్న వీడియో..

భాకరా పేట సీఐ తులసిరామ్‌ గంగమ్మ జాతరలో కత్తి పట్టారు. సొంత గ్రామం కార్వేటినగరం గంగమ్మ జాతరకు వచ్చిన ఆయన స్థానికులతో కలిసి కత్తి పట్టి చిందులేశాడు. డప్పుల దరువులకు తగ్గట్టుగా కత్తిని అటు ఇటూ తిప్పుతూ అదరగొట్టాడు.

Tirupati: గంగమ్మ జాతరలో కత్తి పట్టిన సీఐ.. స్థానికులతో కలిసి చిందులు.. వైరలవుతోన్న వీడియో..
Basha Shek
|

Updated on: May 17, 2022 | 4:05 PM

Share

ప్రస్తుతం తిరుపతి జిల్లా అంతటా గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించలేదు. అయితే ఈఏడాది మాత్రం అంగరంగవైభవంగా గంగ జాతరను నిర్వహిస్తున్నారు. వారం రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా రకరకాల వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. రోజుకో వేషంలో అమ్మవారిని దర్శించుకుంటారు. తాజాగా భాకరా పేట సీఐ తులసిరామ్‌ గంగమ్మ జాతరలో కత్తి పట్టారు. సొంత గ్రామం కార్వేటినగరం గంగమ్మ జాతరకు వచ్చిన ఆయన స్థానికులతో కలిసి కత్తి పట్టి చిందులేశాడు. డప్పుల దరువులకు తగ్గట్టుగా కత్తిని అటు ఇటూ తిప్పుతూ అదరగొట్టాడు.

అయితే  సీఐ సాధారణ దుస్తుల్లో ఇలా చేసి ఉంటే ఏమయ్యేది కాదు. ఎటొచ్చి సీఐ యూనిఫాంలో  కత్తి పట్టి డ్యాన్స్‌ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  కాగా గంగమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా తిరుపతి లోక్ సభ సభ్యుడు డాక్టర్ మద్దెల గురుమూర్తి ఇటీవల వేంకటేశ్వర స్వామి వేషధారణతో అమ్మవారి మొక్కులు తీర్చుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Watch Video: నాకొక తోడు కావాలంటూ వృద్ధుడి రిక్వెస్ట్.. అవాక్కయిన మంత్రి రోజా.. ఏమన్నారంటే..?

SBI SCO Recruitment 2022: ఎస్బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? నేటితో ముగుస్తున్న..

Beetroot Juice: వేసవిలో బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే బోలెడు ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!