AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నాకొక తోడు కావాలంటూ వృద్ధుడి రిక్వెస్ట్.. అవాక్కయిన మంత్రి రోజా.. ఏమన్నారంటే..?

తనకు తోడు ఎవరూ లేరని.. ఒంటరిగా బతకలేకపోతున్నానని ఓ వృద్ధుడు రోజా ఎదుట మొరపెట్టుకున్నాడు. తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా మంత్రి రోజానే అడిగాడు.

Watch Video: నాకొక తోడు కావాలంటూ వృద్ధుడి రిక్వెస్ట్.. అవాక్కయిన మంత్రి రోజా.. ఏమన్నారంటే..?
Minister Roja
Shaik Madar Saheb
|

Updated on: May 17, 2022 | 3:26 PM

Share

Minister Roja: ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం భాగంగా అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటక మంత్రి రోజా కూడా చిత్తూరు జిల్లాలోని నగరిలో గడపగడపకు మన ప్రభుత్వం (gadapa gadapaku mana prabhutvam) కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా మంత్రి రోజా ఆమె నగరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో వింత కోరిక విని ఆమె అవాక్కయ్యారు. తనకు తోడు ఎవరూ లేరని.. ఒంటరిగా బతకలేకపోతున్నానని ఓ వృద్ధుడు రోజా ఎదుట మొరపెట్టుకున్నాడు. తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా మంత్రి రోజానే అడిగాడు. వృద్ధుడి కోరిక విన్న రోజా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెన్షన్ అయితే ఎలాగోలా ఇప్పిస్తాం.. కానీ పెళ్లి చేయలేమంటూ మంత్రి రోజా వృద్ధుడితో పేర్కొన్నారు. అయితే.. పింఛన్ వస్తుంది కానీ.. నీడ, తోడు లేదంటూ మంత్రికి చెప్పాడు. అయితే.. వృద్ధుడి కోరిక విని.. అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

ఈ ఘటన పుత్తూరు మండలం శిరుగురాజుపాలెంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై రోజా ప్రతి ఇంటికి వెళుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుడి కోరిక విన్న.. నాయకులంతా నవ్వుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..