AP Weather Alert: చురుకుగా కదులుతున్న నైరుతిపవనాలు.. ఏపీలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల సహా తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

AP Weather Alert: చురుకుగా కదులుతున్న నైరుతిపవనాలు.. ఏపీలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Ap Weather Alert
Follow us
Surya Kala

|

Updated on: May 17, 2022 | 12:58 PM

AP Weather Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నైరుతి రుతుపవనాలు.. ఉత్తర దిశగా పయనమై… లాంగ్ ఐలాండ్స్  నుంచి ఉత్తర అక్షాంశ, తూర్పు రేఖాంశం వరకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల సహా తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు ఏ విధంగా వాతావరణం ఉండనున్నదో సూచించింది.

ఉత్తర కోస్తా: ఈ రోజు ,రేపు , ఎల్లుండి(మే 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా: ఈ రోజు, రేపు, ఎల్లుండి(మే 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అంతేకాదు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.

రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి(మే 19వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి  లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మరిన్ని వాతావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..