AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shikhar Dhawan Acting Debut: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ‘గబ్బర్’.. షూటింగ్‌ కూడా పూర్తి.. విడుదల ఎప్పుడంటే?

శిఖర్ ధావన్ నటనలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల క్రితం, మేకర్స్ ఒక సినిమా కోసం శిఖర్‌ను సంప్రదించారు. వెంటనే ఓకే చేసి సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు.

Shikhar Dhawan Acting Debut: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 'గబ్బర్'.. షూటింగ్‌ కూడా పూర్తి.. విడుదల ఎప్పుడంటే?
Shikhar Dhawan Acting Debut
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: May 17, 2022 | 10:10 PM

Share

తన బ్యాటింగ్‌తో అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్న క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan).. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మైదానంలో బడా బౌలర్ల సిక్సర్లను బౌండరీలు దాటించినందుకుగాను ఈ భారత బ్యాట్స్‌మెన్‌ను (Indian Cricketer) అభిమానులు ముద్దుగా ‘గబ్బర్’ అని పిలుస్తుంటారు. ఇదిలా ఉంటే శిఖర్ ధావన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉండేందుకు ఓ గుడ్ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అవును, త్వరలో శిఖర్ ధావన్ నటనలోకి అడుగుపెట్టబోతున్నాడని (Shikhar Dhawan Acting Debut) చర్చ జరుగుతోంది. నివేదికలను విశ్వసిస్తే, శిఖర్ ధావన్ ఒక భారీ చిత్రంతో నటించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ని శిఖర్ పూర్తి చేశాడని కూడా చెబుతున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా వెల్లడి కాలేదు.

Also Read: World Boxing Championship: నిరాశ పరిచిన ఐదుగురు.. పతకాలు ఖాయం చేసిన ముగ్గురు భారత మహిళా బాక్సర్లు..

దీనిపై చిత్ర వర్గాల్లోని కొంతమంది మాట్లాడుతూ,”శిఖర్ ఎప్పుడూ నటీనటులను ఎంతో గౌరవించేవాడు. అలాంటి పరిస్థితుల్లో తనకు నటించే ఆఫర్ రావడంతో సంతోషంగా ఓకే చెప్పి అందులో చేరిపోయాడు. అదే సమయంలో, నిర్మాతలు కూడా ఈ పాత్ర కోసం శిఖర్‌ను బాగా ఇష్టపడ్డారు” అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కొన్ని నెలల క్రితమే ఈ సినిమా కోసం మేకర్స్ శిఖర్‌ని సంప్రదించారు. శిఖర్ చిత్రం సరైన పూర్తి నిడివి పాత్రలా ఉంటుంది. ఇది అతిధి పాత్ర మాత్రం కాదు. సినిమాకి శిఖ‌ర్ పాత్ర చాలా కీలకమంట. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని అంటున్నారు.

‘రామసేతు’ సెట్స్‌లో కనిపించిన శిఖర్ ధావన్..

శిఖర్ గత ఏడాది అక్టోబర్‌లో అక్షయ్ కుమార్ రాబోయే చిత్రం ‘రామ్ సేతు’ సెట్‌లో కనిపించాడు. అదే సమయంలో, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచా కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. శిఖర్ సెట్స్‌కి వెళ్లడంతో అతను కూడా సినిమాలో భాగమయ్యాడని పుకార్లు వచ్చాయి. అయితే, పలు వార్తల ప్రకారం, శిఖర్ ‘రామసేతు’తో తన అరంగేట్రం చేయడం లేదని తెలుస్తోంది.

అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్‌లతో మంచి బంధం..

అక్షయ్, శిఖర్ చాలా క్లోజ్. ఇదే కాకుండా నటుడు రణవీర్ సింగ్‌తో శిఖర్‌కు ఉన్న బంధం కూడా చాలా గొప్పది. గతేడాది డిసెంబర్‌లో నటుడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. అది కాస్తా నెట్టింట్లో తెగ సందడి చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: PBKS vs DC IPL Match Result: పంజాబ్ పై విజయం సాధించిన ఢిల్లీ.. ప్లే ఆఫ్ ఆశలు పదిలం

PBKS vs DC Score: హాఫ్ సెంచరీతో మార్ష్ కీలక ఇన్నింగ్స్.. స్వల్ప స్కోర్‌కే ఢిల్లీ పరిమితం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?