- Telugu News Photo Gallery Sports photos Nikhat Zareen, Manisha Moun & Parveen Hooda confirms Medal in Women's Boxing World Championships 2022
World Boxing Championship: నిరాశ పరిచిన ఐదుగురు.. పతకాలు ఖాయం చేసిన ముగ్గురు భారత మహిళా బాక్సర్లు..
భారతదేశంలోని 8 మంది మహిళా బాక్సర్లలో ముగ్గురు సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం వల్ల ఈ పతకాలు సాధ్యమయ్యాయి. మిగిలిన ఐదుగురు ఓడిపోయి పతకాల రేసు నుంచి నిష్క్రమించారు.
Updated on: May 17, 2022 | 2:23 PM

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు సత్తా చాటుతున్నారు. వారి పంచ్‌లు పతకాలను ఖాయం చేస్తున్నాయి. భారతదేశంలోని 8 మంది మహిళా బాక్సర్లలో ముగ్గురు సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం వల్ల ఈ పతకాలు సాధ్యమయ్యాయి. మిగిలిన ఐదుగురు ఓడిపోయి పతకాల రేసు నుంచి నిష్క్రమించారు. భారత బ్యాగ్‌లో ముగ్గురు మహిళా బాక్సర్లు తమ పతకాలను ఖాయం చేసుకున్నారు.

నిఖత్ జరీన్ పంచ్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. ఆమె 52 కేజీల వెయిట్ కేటగిరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చార్లీ సియాన్‌ను ఓడించింది. నిఖత్‌కి ఇదే తొలి ప్రపంచ పతకం కూడా.

రెండో పతకంతో మనీషా మౌన్ వేసిన పంచ్ కూడా రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఆమె 57 కేజీల వెయిట్ కేటగిరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్ప్లిట్ డెసిషన్ కింద 4-1తో నమున్ మోంఖోర్‌ను ఓడించింది.

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో ప్రవీణ్ హుడా మూడో పతకాన్ని భారత్ ఖాతాలో వేసే పనిలో పడ్డాడు. 63 కేజీల విభాగంలో హుడా పోరాడి తన ప్రత్యర్థి తజకిస్థాన్‌కు చెందిన షోరియాను 5-0తో చిత్తు చేసింది.

ఈ మూడు విజయాలు పతకాన్ని ఖాయం చేసుకోగా, ఐదుగురు బాక్సర్ల ఓటమి కూడా పతక ఆశలపై నీళ్లు చల్లింది. నీతు (48 కేజీలు), పూజ (81 కేజీలు), అనామిక (50 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), నందిని (+81 కేజీలు) క్వార్టర్స్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.




