AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Tenth Exams 2022: తెలంగాణ టెన్త్‌ పరీక్ష కేంద్రాల వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్‌ నంబర్లు.. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే..

తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) సోమవారం (మే 16) సమీక్ష నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్‌ నంబర్లను..

TS Tenth Exams 2022: తెలంగాణ టెన్త్‌ పరీక్ష కేంద్రాల వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్‌ నంబర్లు.. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే..
Ts Ssc Exams 2022
Srilakshmi C
|

Updated on: May 17, 2022 | 4:08 PM

Share

Sabita Indrareddy Reviews on TS SSC Exams 2022: తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) సోమవారం (మే 16) సమీక్ష నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద డీఈవో, ఎంఈవో ఫోన్‌ నంబర్లను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఈ సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా పరిష్కరించడానికి ప్రభుత్వ పరీక్షల విభాగం (TS SSC Board) డైరెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను (CCTV Cameras) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఈ మేరకు మంత్రి సబితా సూచించారు.

కాగా మే 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దాదాపు 2,861 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే హాల్ టికెట్లను కూడా ఆయా పాఠశాలలకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఎఎన్ఎం, ఒక ఆశా ఉద్యోగిని అందుబాటులో ఉండే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కేంద్రంలో ఓఆర్ఎస్ పాకెట్లు, మందులు, తాగు నీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

క్వశ్చన్‌ పేపర్‌లోని ప్రతి పేజీపై హాల్‌ టికెట్‌ నెంబర్‌ తప్పనిసరి.. ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై విద్యార్థులు హాల్‌టికెట్‌ సంఖ్యను తప్పనిసరిగా రాయాలి. ప్రశ్నపత్రాలను సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీసి గతంలో బయటకు పంపిన నేపథ్యంలో దాన్ని 2017 నుంచి అమలు చేస్తున్నారు. ఈసారి కూడా అదే నిబంధన ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని, విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్‌ పిరియడ్‌ ఇస్తామన్నారు. ఆంగ్లం సబ్జెక్టుకు ప్రశ్నపత్రంతో పాటే గ్రామర్‌తో కూడిన పార్ట్‌-బి ప్రశ్నపత్రాన్ని అందజేస్తామని, మిగిలిన సబ్జెక్టులకు మాత్రం చివరి అరగంటలో పార్ట్‌-బి బిట్‌ పేపర్‌ ఇస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.