TS Inter Exams 2022: ఇటు తెలంగాణలో ఇంటర్‌ మూల్యాంకన పారితోషికం పెంపు.. అటు ఏపీలో ఉపాధ్యాయుల భారీ నిరసనలు..

తెలంగాణ ఇంటర్మీడియట్‌ సమాధాన పత్రాల మూల్యాంకనంలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఇచ్చే పారితోషికాన్ని తెలంగాణ ఇంటర్‌ బోర్డు (TSBIE) పెంచింది. ఇప్పటివరకు ఒక్కో జవాబుపత్రాన్ని దిద్దినందుకు ఇస్తున్న..

TS Inter Exams 2022: ఇటు తెలంగాణలో ఇంటర్‌ మూల్యాంకన పారితోషికం పెంపు.. అటు ఏపీలో ఉపాధ్యాయుల భారీ నిరసనలు..
Teachers Protest
Follow us

|

Updated on: May 17, 2022 | 3:49 PM

AP Govt Teachers Protest: తెలంగాణ ఇంటర్మీడియట్‌ సమాధాన పత్రాల మూల్యాంకనంలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఇచ్చే పారితోషికాన్ని తెలంగాణ ఇంటర్‌ బోర్డు (TSBIE) పెంచింది. ఇప్పటివరకు ఒక్కో జవాబుపత్రాన్ని దిద్దినందుకు ఇస్తున్న రూ.18.93లను రూ.23.66కి పెంచారు. ఇతర సిబ్బందికిచ్చే పారితోషికాన్ని కూడా 25 శాతం పెంచుతూ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఈ మేరకు మంగళవారం (మే 17) ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం చేసినందుకు తమకు ఏళ్లకాలంగా అతి తక్కువ మొత్తాన్ని చెల్లిస్తున్నారంటూ.. దానిని పెంచాలని డిమాండ్‌ చేస్తూ విశాఖపట్నంలో అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు నేడు నిరసనలకు దిగారు. వివరాల్లోకెళ్తే..

సీపీఎస్‌ రద్దు (CPS abolition), టెన్త్‌ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌, ఇతర సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాలు విశాఖలో మంగళవారం మహా నిరసన చేపట్టాయి. క్వీన్‌మేరీ పాఠశాల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. తమ సమస్యలను ఎన్నో సార్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని.. అందుకే నిరసనకు దిగాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు చెప్పారు.

పదో తరగతి పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌కు సంబంధించి గతంలో 50 మార్కుల పేపర్‌కు రూ.6 ఇచ్చేవారని.. ఇప్పుడు పేపర్‌ 100 మార్కులైనా అదే మొత్తం ఇస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్‌సీ, డీఏలు, రావాల్సిన రాయితీల్లో ప్రభుత్వం తమకు మొండిచేయి చూపిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని వాపోతున్నారు. సీపీఎస్ విషయంలో ఇచ్చిన మాటను సీఎం జగన్ తప్పారని విమర్శించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.