Satya Nadella: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బంపర్.. టెకీల జీతాలు డబుల్..!
Microsoft CEO Satya Nadella: ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను రెండింతలు చేశామని, తమ కెరీర్ మధ్యలో ఉన్న వారికి వేతన పెంపు భారీగా ఉంటుందని ఉద్యోగులకు..
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఈవో సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను రెండింతలు చేశామని, తమ కెరీర్ మధ్యలో ఉన్న వారికి వేతన పెంపు భారీగా ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్న నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది.
సత్య నాదెళ్ల సంస్థ తన ఉద్యోగుల అత్యుత్తమ పనితీరును అభినందిస్తూ ఒక ఇ-మెయిల్ పంపారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల జీతాలను రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు. అదే సమయంలో మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఇతర ఉన్నతాధికారుల జీతాలు దాదాపు 25 శాతం పెరగనున్నాయి. ఇతరులు మరింత ఇంక్రిమెంట్లను పొందుతారు. తమ కెరీర్ ప్రారంభ, మధ్య దశల్లో ఉన్నవారు వేతనాల పెంపుతో ఎక్కువ ప్రయోజనం పొందుతారని ఆయన ప్రకటనలో తెలిపారు.
కస్టమర్లు, భాగస్వాములకు మీరందించిన అసమాన సేవలతో మన నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉందని మరోసారి నిరూపణ అయిందని, మీ అందరిపై దీర్ఘకాల పెట్టుబడులకు తాము సిద్ధమయ్యామని ఈమెయిల్‌లో తెలిపారు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం ఫిబ్రవరిలో కార్పొరేట్, టెకీలకు వేతనాలను రెట్టింపు చేసింది. టాప్ టాలెంట్ నియామకాలతో పాటు ప్రస్తుత ఉద్యోగులను కాపాడుకునేందుకు వేతనాల బడ్జెట్‌ను అమెజాన్ భారీగా పెంచింది.