Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBI Raids: కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కొడుకు ఆస్తులపై సీబీఐ దాడులు.. ఒకేసారి ముంబై, ఢిల్లీ, తమిళనాడులోని ఏడు చోట్ల సోదాలు

కార్తీ ఇల్లు, ఆఫీసుతో పాటు పలు చోట్ల సీబీఐ దాడులు చేసింది. 2010-14 మధ్య కాలంలో జరిగిన లావాదేవీలు, రెమిటెన్స్‌ల ఆరోపణలపై కార్తీ చిదంబరంపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

CBI Raids: కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కొడుకు ఆస్తులపై సీబీఐ దాడులు.. ఒకేసారి ముంబై, ఢిల్లీ, తమిళనాడులోని ఏడు చోట్ల సోదాలు
Karti Chidambarams And Chid
Follow us
Sanjay Kasula

|

Updated on: May 17, 2022 | 12:21 PM

కేంద్ర దర్యాప్తు సంస్థ తరఫున కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం(P Chidambarams) తనయుడు, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరానికి(Karti Chidambaram) చెందిన పలుచోట్ల మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. కార్తీ ఇల్లు, ఆఫీసుతో పాటు పలు చోట్ల సీబీఐ దాడులు చేసింది. 2010-14 మధ్య కాలంలో జరిగిన లావాదేవీలు, రెమిటెన్స్‌ల ఆరోపణలపై కార్తీ చిదంబరంపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముంబై, ఢిల్లీ, తమిళనాడులోని ఏడు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదంబరంతో పాటు ఆయన సహచరులపై పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కార్తీ చిదంబరం తన ప్రభావంతో చైనా కంపెనీ వ్యక్తులకు వీసాలు పొందారు. ఈ వీసాకు బదులుగా 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఆయన తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. ఇది 2011 ఇది జరిగింది. ఇక్కడ, సీబీఐ దాడి తర్వాత కార్తీ చిదంబరం కేంద్ర దర్యాప్తు సంస్థను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ రైడ్ ఎన్నిసార్లు జరిగిందో లెక్కించడం మరిచిపోయాను అంటూ ట్వీట్ చేశారు పి. చిదంబరం.  

అక్రమ ప్రయోజనాలు పొందినందుకు కార్తీ చిదంబరంపై కేసు  

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అక్రమ సంపాదన ఆరోపణలపై మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు, లోక్‌సభ ఎంపి కార్తీ చిదంబరంపై కొత్త కేసు నమోదు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారులు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసులో, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) హయాంలో 250 మంది చైనా పౌరులకు వీసాలు ఇప్పించేందుకు కార్తీ చిదంబరం రూ. 50 లక్షలు లంచం అందుకున్నారని సిబిఐ ఆరోపించినట్లు అధికారులు తెలిపారు. ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల కోసం ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్‌ఐపిబి) క్లియరెన్స్ పొందారనే ఆరోపణలపై క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.