Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు బీమా.. అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం..

అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశంలో అమర్‌నాథ్ యాత్రకు అవసరమైన అన్ని కేంద్ర పారామిలటరీ బలగాలను యాత్రలో మోహరించాలని ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ చీఫ్‌లకు..

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు బీమా.. అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం..
Amit Shah
Follow us
Sanjay Kasula

|

Updated on: May 17, 2022 | 8:21 PM

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఇవాళ న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశంలో అమర్‌నాథ్ యాత్రకు అవసరమైన అన్ని కేంద్ర పారామిలటరీ బలగాలను యాత్రలో మోహరించాలని ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ చీఫ్‌లకు కేంద్ర హోంమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలాని సూచించారు. ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమర్‌నాథ్ యాత్ర భద్రత, యాత్రికులకు కావాల్సిన సౌకర్యాలపై కూడా హోంమంత్రి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సమాచార బ్యూరో డైరెక్టర్‌, జమ్మూకశ్మీర్‌ చీఫ్‌ సెక్రటరీ, భద్రతా సంస్థల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

కొవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తరువాత రెండేళ్ల విరామం అనంతరం యాత్ర తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తుంది. అమర్ నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.

గతంలో రూ. 100 ఉన్న ఫీజు ఇప్పుడు రూ. 120గా నిర్ణయించినట్లు జమ్మూలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ యుతేందర్ కుమార్ తెలిపారు. ఈ యాత్రకు పాల్గొనే వారు 13-75 సంవత్సరాల మధ్య వయస్సు గల భక్తులై ఉండాలి.