- Telugu News Photo Gallery Ipl 2022 axar patel became the second indian player to achieve the double of 1000 runs and 100 wickets in ipl in Telugu
IPL 2022: ఈ 9 కోట్ల ఆటగాడు 16 కోట్ల స్టార్ ప్లేయర్ రికార్డును సమం చేశాడు..
IPL 2022: ఐపీఎల్ లో మొత్తం 121 మ్యాచ్‌లు ఆడిన అక్షర్ 18.92 సగటుతో 1116 పరుగులు చేశాడు. అదే సమయంలో 30.27 సగటుతో 101 వికెట్లు తీసుకున్నాడు.
Updated on: May 17, 2022 | 7:34 PM

ఐపీఎల్ లో అక్షర్ పటేల్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 1000 పరుగులు, 100 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ జడేజా రికార్డును సమం చేశాడు

ఢిల్లీ జట్టు రూ. 9 కోట్లు వెచ్చించి మరీ అక్షర్ పటేల్‌ను కొనుగోలు చేసింది. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ సీజన్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు అక్షర్.

మే 16నపంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అజేయంగా 17 పరుగులు చేశాడు. ఆ తర్వాత బంతితో 2 వికెట్లు పడగొట్టాడు

ఐపీఎల్ లో మొత్తం 121 మ్యాచ్‌లు ఆడిన అక్షర్ 18.92 సగటుతో 1116 పరుగులు చేశాడు. అదే సమయంలో 30.27 సగటుతో 101 వికెట్లు తీసుకున్నాడు.

रఇక రవీంద్ర జడేజా పేరిట ఇప్పటివరకు 210 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 26కు పైగా సగటుతో 2502 పరుగులు చేశాడు. అదే సమయంలో 30.79 సగటుతో 132 వికెట్లు తీసుకున్నాడు.

ఐపీఎల్‌లో 1000 ప్లస్ పరుగులు, 100 ప్లస్ వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా అక్షర్ పటేల్ నిలిచాడు.





























