IPL 2022: విజయోత్సాహంలో గుజరాత్‌ ఆటగాళ్లు.. వై దిస్‌ కొలవెరి డి అంటూ రచ్చ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Gujarat Titans: చివరి మ్యాచ్‌కు ముందు దొరికిన కాస్త విశ్రాంతిని వేడుకగా మార్చుకున్నారు. ఆటగాళ్లందరూ ఒక్కచోట చేరి సంతోషంగా గడిపారు. పాటలు పాడుతూ సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఎంజాయ్‌ చేశారు.

IPL 2022: విజయోత్సాహంలో గుజరాత్‌ ఆటగాళ్లు.. వై దిస్‌ కొలవెరి డి అంటూ రచ్చ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Gujarat Titans
Follow us

|

Updated on: May 17, 2022 | 9:45 PM

Gujarat Titans: ఐపీఎల్‌-2022 సీజన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన జట్టు ఏదైనా ఉందంటే.. అది గుజరాత్‌ టైటాన్స్‌.  టోర్నీ ప్రారంభానికి ముందు ఈ టీంలో స్టార్‌ ఆటగాళ్లు లేరని, జట్టు బలహీనంగా ఉందని కామెంట్లు చేశారు. అయితే లీగ్‌ ప్రారంభమయ్యాక వరుస విజయాలు సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది. హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్‌ ఇప్పటివరకు 13 మ్యాచ్‌లలో 10 గెలిచి 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తద్వారా పట్టికలో అగ్రస్థానంతో పాటు ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా అవతరించింది. దీంతో గుజరాత్‌  టైటాన్స్ ( Gujarat Titans) ఆటగాళ్లు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. చివరి మ్యాచ్‌కు ముందు దొరికిన కాస్త విశ్రాంతిని వేడుకగా మార్చుకున్నారు. అందరూ ఒక్కచోట చేరి సంతోషంగా గడిపారు. పాటలు పాడుతూ సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఎంజాయ్‌ చేశారు. స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అయితే దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో షారుఖ్‌ ఖాన్‌ గిటార్‌ వాయించిన తరహాలో స్టిల్స్‌ ఇచ్చాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు సాయి సుదర్శన్‌, విజయ్‌ శంకర్‌ తదితర ఆటగాళ్లు ‘వై దిస్‌ కొలవెరి డి’ అంటూ తమ గాన ప్రతిభను చాటుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలను గుజరాత్‌ టైటాన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

కాగా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది గుజరాత్‌. ఈ మ్యాచ్‌లో గెలుపోటములు టైటాన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. అయితే బెంగళూరుకు మాత్రం గుజరాత్‌తో పోరు డూ ఆర్‌ డై లాంటిదే. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే వారు కచ్చితంగా గెలవాల్సిందే. ఒకవేళ ఓడిపోతే మాత్రం వేరే జట్ల అవకాశాలపై ఆధారపడాల్సిందే. ఆర్సీబీ నెట్‌ రన్‌రేట్‌ కూడా తక్కువగా ఉండడం వారి ప్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Vijayasai Reddy: చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది.. ఆయనను తక్షణమే అరెస్ట్‌ చేయాలి.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

Viral Video: పరుపుపై పడుకోవడానికి పిల్ల ఏనుగు పోరాటం.. జూ కీపర్‌తో అమీతుమీ.. నవ్వులు పూయిస్తోన్న వైరల్‌ వీడియో..

IPL 2022: ఈ 9 కోట్ల ఆటగాడు 16 కోట్ల స్టార్ ప్లేయర్ రికార్డును సమం చేశాడు..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి