MI vs SRH IPL Match Result: ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. IPL 2022లో తమ 13వ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి , ఉమ్రాన్ మాలిక్‌ల అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది
MI vs SRH IPL Match Result: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. IPL 2022లో తమ 13వ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్‌ల అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టోర్నీలో ఆశలు సజీవంగా ఉంచుకోవాలని తహతహలాడుతున్న హైదరాబాద్ ఈ విజయంతో వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. 13 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది ఆరో విజయం. అలాగే 13వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కి ఇది 10వ ఓటమి. గత మూడు వరుస మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ జోడీ ఈ మ్యాచ్ లో రాణించారు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుని 95 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ తన అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు. 48 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
రోహిత్ వికెట్ తర్వాత ముంబై ఇన్నింగ్స్ తడబడింది. హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. దాంతో వరుస వికెట్లు కోల్పోతూ ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఉమ్రాన్ హైస్పీడ్ బౌన్స్‌లతో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, డేనియల్ సామ్స్ వికెట్లను పడగొట్టాడు. మొత్తంగా నిర్ణిత 20 ఓవర్లలో హైదరాబాద్ 193 పరుగులు చేయగా.. ముంబై 190 పరుగులు చేసింది. ఈ విజయంతో ప్లేఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది హైదరాబాద్.
మరిన్ని ఇక్కడ చదవండి :