IPL 2022: హైదరాబాద్‌ ప్లేఆఫ్ ఆశలు సజీవం.. కానీ ఆ జట్లు ఓడితేనే సన్‌రైజర్స్‌కు అవకాశం..

ఐపీఎల్ 2022(IPL 2022)లో ముంబై ఇండియన్స్(MI), చెన్నై సూపర్ కింగ్స్(CSK) చివరి రెండు స్థానాల్లో నిలిచేలా కనిపిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి ఎనిమిదో స్థానానికి ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

IPL 2022: హైదరాబాద్‌ ప్లేఆఫ్ ఆశలు సజీవం.. కానీ ఆ జట్లు ఓడితేనే సన్‌రైజర్స్‌కు అవకాశం..
SRH
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 18, 2022 | 7:01 AM

ఐపీఎల్ 2022(IPL 2022)లో ముంబై ఇండియన్స్(MI), చెన్నై సూపర్ కింగ్స్(CSK) చివరి రెండు స్థానాల్లో నిలిచేలా కనిపిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి ఎనిమిదో స్థానానికి పడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబైతో జగిరిన మ్యాచ్‌లో గెలుపొంది 8వ స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మే 17, మంగళవారం వాంఖడే స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ 3 పరుగుల స్వల్ప తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.

తమ చివరి ఐదు మ్యాచ్‌ల్లో వరుస పరాజయాల కారణంగా ప్లేఆఫ్‌ రేస్‌లో హైదరాబాద్ వెనుకబడింది. హైదరాబాద్‌ 13 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించిన హైదరాబాద్ ఇప్పుడు 12 పాయింట్లు సంపాదించింది. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లను సమం చేసింది. అయినప్పటికీ ఈ జట్టు నెట్ రన్ రేట్‌లో చాలా వెనుకబడి ఉంది. ముంబై విషయానికి వస్తే.. రోహిత్ శర్మ జట్టు 13 మ్యాచ్‌ల్లో పదింటిల్లో ఓటమి పాలయింది.

ప్లేఆఫ్‌లకు ఏమి అవసరం?

ఇవి కూడా చదవండి

ఇప్పుడు హైదరాబాద్ ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే అది ఇతర జట్లపై చాలా ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ చివరి మ్యాచ్‌లో 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో మే 22న పోటీపడనుంది. అయితే దీనికి ఒకరోజు ముందు ఢిల్లీ-ముంబై మ్యాచ్ ఫలితం మొత్తం పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. ఢిల్లీ గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీ ఓడిపోయి, అంతకు ముందు బెంగళూరు కూడా గుజరాత్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోతే, చివరి రోజు హైదరాబాద్, పంజాబ్‌లకు అద్భుతమైన ఆవకాశాలు ఉంటాయి.

మరిన్ని క్రీడవార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…