Hyderabad: హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై దాడులు.. 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సీబీఐ..

2010 నుంచి ఈ నెట్వర్క్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన వాకస్ మాలిక్ పేరు‌తో బెట్టింగ్ చేపడుతున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై దాడులు.. 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన  సీబీఐ..
Cricket Betting
Follow us

|

Updated on: May 17, 2022 | 4:01 PM

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్‌ మాఫియాపై సీబీఐ దాడులు చేసింది. ఈమేరకు నగరంలో నాలుగు చోట్ల సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ నెట్‌వర్క్ 2013 నుంచి బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా ఈ మాఫియా బెట్టింగ్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ నెట్‌వర్క్‌లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్‌కు చెందిన వారిపై కేసులు పెట్టారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియని ప్రభుత్వాధికారుల ఇంట్లోనూ సీబీఐ సోదాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు రెండు ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది.

Also Read: IND vs SA: 12 మ్యాచ్‌ల్లో 368 పరుగులతో దుమ్ము రేపిన తెలుగబ్బాయ్.. టీమిండియా జెర్సీ ధరించే ఛాన్స్.. ఎవరో తెలుసా?

ఈ ఎఫ్‌ఐఆర్‌‌లో ఢిల్లీకి చెందిన దిలీప్ కుమార్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన గుర్రం సతీశ్, గుర్రం వాసుల అనే వ్యక్తలు పేర్లు కూడా ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా నెట్‌వర్క్ గుర్తింపు పొందిందని అధికారులు పేర్కొంటున్నారు. నిందితుల బ్యాంకు ఖాతా ద్వారా ఇప్పటి వరకు దాదాపు రూ. 10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.

2010 నుంచి ఈ నెట్వర్క్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన వాకస్ మాలిక్ పేరు‌తో బెట్టింగ్ చేపడుతున్నారు. పాకిస్తాన్ నుంచి గుర్రం సతీష్‌ను వాకస్ మాలిక్ డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో 2013 నుంచి దాదాపు రూ. 43 లక్షలకు పైగా నిధులు ఉన్నట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్లు సీబీఐ పేర్కొంది. రెండో ఎఫ్ఐఆర్‌లో సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ అనే వ్యక్తుల పేర్లు కూడా చేర్చారు.

ఇవి కూడా చదవండి

Also Read: Watch Video: ఓడియన్ స్మిత్ దెబ్బకు పేకమేడలా కూలిన పంజాబ్ టీం.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

IPL 2022: కోహ్లీ, రోహిత్ పేలవ ఫామ్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి