AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: పొలిటికల్ మీటింగ్స్ వారి టార్గెట్.. దర్జాగా వస్తారు.. దోచుకెళ్తారు.. కట్ చేస్తే గుంటూరులో దొరికారు..

రాజకీయ పార్టీల సభలు, సమావేశాలే లక్ష్యంగా జేబు దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్ రాష్ట్ర దొంగలను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆరు లక్షల రూపాయల నగదు, కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

AP: పొలిటికల్ మీటింగ్స్ వారి టార్గెట్.. దర్జాగా వస్తారు.. దోచుకెళ్తారు.. కట్ చేస్తే గుంటూరులో దొరికారు..
Pickpockets
Sanjay Kasula
|

Updated on: May 17, 2022 | 3:57 PM

Share

జల్సాలకు అలవాటు పడిన యువత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కు తున్నారు. గుంటూరు జిల్లా(Guntur District) తాడేపల్లికి చెందిన ఇట్టా వాసు, సుబ్బారావు, బెరోతుల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్ రావు, గోదావరి ఏసోబు, బత్తుల ఉమామహేశ్వరరావు, జోష్ కుమార్, కట్ట రక్షక్ రాజు, బొజ్జగాని దుర్గా రావు, బాల నేరస్తుడు ముఠాగా ఏర్పడ్డారు. రాజకీయ పార్టీల సభలు, జనసమూహము ఎక్కువగా ఉండే ప్రదేశాలే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతోంది ఈ ముఠా. గత నెలలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఈ ముఠా తమ చేతివాటాన్ని ప్రదర్శించింది. చింతపల్లి, కొండమల్లేపల్లి, నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. నాగార్జున సాగర్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

తీగ లాగితే డొంక కదిలినట్లు గా రాజకీయ పార్టీల సభ్యులు సమావేశం లక్ష్యంగా జేబు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా బట్టబయలైంది. విలాసాలకు అలవాటు పడి తాము చేస్తున్న పనిలో సరిపోను డబ్బులు రాక జేబుదొంగ తరాలకు పాల్పడుతున్నట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా లో ఆరుగురిని అరెస్టు చేశామని మరొకరు పరారీలో ఉన్నారు. వీరి నుంచి ఆరు లక్షల రూపాయలు కారు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై హైదరాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ నల్లగొండ జిల్లాలో కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు.