ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులకు ఉర్రూతలుగించిన రాజశేఖర్ తర్వాత కొంతకాలం సినిమాలు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ‘గరుడ వేగ’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దుమ్మురేపాడు. ఇక ఈ సినిమా తర్వాత కల్కీ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇక ‘శేఖర్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ఆలరించేందుకు సిద్ధమయ్యారు. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘జోసెఫ్’ చిత్రానికి రీమేక్గా తెరకెక్కించారు. ఈ నెల 20న విడుదల కానున్న విడుదల కానున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరుగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
జీడితోటలో కలకలం.. అక్కడి సీన్ చూసి భయంతో కూలీలు పరుగులు..