Karnataka: ముచ్చటపడి వైన్ ఆర్డరిచ్చిన యువతి.. కట్ చేస్తే ఓ ఫోన్ కాల్.. చివరికి దిమ్మతిరిగే షాక్!

అడ్డదిడ్డమైన సామెతలు చెబుతున్నానని అనుకునేరు.. పాయింట్‌కి వచ్చేస్తా.. ఓ యువతి ఎంతో ముచ్చటపడి ఆన్‌లైన్‌లో తనకిష్టమైన వైన్‌ను ఆర్డర్ ఇచ్చింది..

Karnataka: ముచ్చటపడి వైన్ ఆర్డరిచ్చిన యువతి.. కట్ చేస్తే ఓ ఫోన్ కాల్.. చివరికి దిమ్మతిరిగే షాక్!
Wine
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 01, 2022 | 1:48 PM

ఆన్‌లైనూ.. ఆన్‌లైనూ.. నువ్వు ఏం చేస్తావు అని అడిగితే.. అకౌంట్‌లో ఉన్న డబ్బులు ఊడ్చేస్టానందట… ఇదేంటి అడ్డదిడ్డమైన సామెతలు చెబుతున్నానని అనుకునేరు.. పాయింట్‌కి వచ్చేస్తా.. ఓ యువతి ఎంతో ముచ్చటపడి ఆన్‌లైన్‌లో తనకిష్టమైన వైన్‌ను ఆర్డర్ ఇచ్చింది. అందుకోసం డబ్బులు కూడా చెల్లించింది. ఇందులో ఏముంది వైన్ ఇంటికొచ్చి ఉంటుందిలే అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆర్డర్ చేసిన ఆమెకు కొద్దిసేపటి తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది.. అంతే.! బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

బెంగళూరులోని లాల్‌బాగ్‌రోడ్డు అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న 22 ఏళ్ల యువతి.. కిందటి నెల 22వ తేదీన ఎంతగానో ముచ్చటపడి తనకిష్టమైన వైన్ ఆర్డర్ ఇచ్చింది. ఆమె ఓ వెబ్‌సైట్‌ద్వారా ఈ ఆర్డర్ ప్లేస్ చేసి.. రూ. 540 చెల్లించింది. ఇక కొద్దిసేపటి తర్వాత సదరు యువతికి ఓ ఆగంతకుడు దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వైన్‌కు డెలివరీ ఫీజుగా రూ. 10 చెల్లించాలని.. మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.. అది చెప్పాలంటూ కోరాడు. ఇంకేముంది ఆమె ఓటీపీ చెప్పింది.. బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 49 వేలకు పైగా మాయమయ్యాయి. చివరికి మోసపోయానని తెలుసుకున్న సదరు యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

Also Read: 

Viral Video: సీబీఐ రైడింగ్ అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

వాళ్లు వదులుకున్నారు.. వీళ్లు ఒడిసి పట్టుకున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీరే!

180 బంతుల్లో 220 పరుగులు.. 6గురి బౌలర్ల భరతం పట్టారు.. కట్ చేస్తే.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు!

Viral Video: అయ్యో.! చూస్కోబడ్లే.! ఫోన్ చూసుకుంటూ నడిచాడు.. పట్టాలపై పడ్డాడు.. కట్ చేస్తే!