RRR Movie: వాళ్లు వదులుకున్నారు.. వీళ్లు ఒడిసి పట్టుకున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీరే!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల

RRR Movie: వాళ్లు వదులుకున్నారు.. వీళ్లు ఒడిసి పట్టుకున్నారు.. 'ఆర్ఆర్ఆర్'‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీరే!
Rrr Movie
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Apr 01, 2022 | 2:02 PM

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వసూళ్ళలో రూ. 500 కోట్ల మార్క్ అందుకున్న ఈ చిత్రం.. రూ. 1000 కోట్ల వైపుకు దూసుకుపోతూ ఇండస్ట్రీ రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతోంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అలియా భట్, బ్రిటీష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే వీరికంటే ముందు జక్కన్న పలువురు స్టార్ హీరోయిన్లను ఈ సినిమా కోసం సంప్రదించారట. అయితే వివిధ కారణాల వల్ల వారు ఆర్ఆర్ఆర్ సినిమాను రిజెక్ట్ చేశారట. మరి నెట్టింట హల్చల్ చేస్తోన్న ఆ హీరోయిన్ల లిస్టు ఏంటో చూసేద్దాం పదండి..

సీత పాత్ర కోసం మొదటిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను జక్కన్న సంప్రదించగా.. ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని టాక్. ఆ తర్వాత పరిణితీ చోప్రాను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె చేతిలో వరుస సినిమాలు ఉండటంతో.. ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. చివరికి సీత పాత్రలో అలియా భట్ తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది.

మరోవైపు ఎన్టీఆర్‌కు జోడిగా మొదటిగా అమీ జాక్సన్‌ను జక్కన్న సంప్రదించారు. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ఈ భారీ ప్రాజెక్ట్‌కు నో చెప్పాల్సి వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్ కైఫ్‌ను కూడా సంప్రదించగా.. ఆమె కూడా వదులుకుంది. ఆ తర్వాత బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను తీసుకున్నారు.. అనూహ్యంగా షూట్ మొదలైన కొద్దిరోజులకే ఆమె తప్పుకుంది. దీనితో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్‌కు దక్కింది.

Also Read: Viral Video: సీబీఐ రైడింగ్ అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా