Drug Case: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్‌ సప్లయర్‌ అరెస్టు.. ఎవరో తెలిసి షాకైన పోలీసులు..!

Drug Case: డ్రగ్‌ సరఫరా విచ్చల విడిగా కొనసాగుతోంది. డ్రగ్స్‌ మాఫియాను రూపుమాపేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అనుమానం ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున తనిఖీలు..

Drug Case: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్‌ సప్లయర్‌ అరెస్టు.. ఎవరో తెలిసి షాకైన పోలీసులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 01, 2022 | 1:00 PM

Drug Case: డ్రగ్‌ సరఫరా విచ్చల విడిగా కొనసాగుతోంది. డ్రగ్స్‌ మాఫియాను రూపుమాపేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అనుమానం ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని డ్రగ్స్‌ (Drug) దందా కొనసాగిస్తున్న ముఠాలు ఎట్టకేలకు దొరికిపోతున్నారు. ఇక హైదరాబాద్‌ (Hyderabad)లో కూడా డ్రగ్స్‌ దందా విపరీతంగా కొనసాగుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తాజాగా మరో డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రగ్స్‌ సరఫరాలో పట్టుబడిన వ్యక్తిని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సరఫరా చేస్తున్నది ఓ మహిళ. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆమె పేరే మాన్సీ. నాచారంలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. భర్త మదన్‌ మనేకర్‌తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది. అరకు నుంచి సరకు తీసుకొచ్చి.. మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో దందా షురూ చేశారు. మార్చి 12న మాన్సీ దంపతులు.. మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయిన్‌పల్లి పోలీసుల కంట్లో పడ్డారు. కిలో గంజాయితో యువకులిద్దరూ చిక్కగా, దంపతులు పారిపోయారు. వారిచ్చిన సమాచారంతో గాలిస్తుండగా కొంపల్లి దగ్గర మాన్సీని పట్టుకున్నారు.

ఏపీకి చెందిన ఆమె కుటుంబీకులు.. నాగ్‌పుర్‌ జిల్లాలో స్థిరపడ్డారు. భోపాల్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన మాన్సీ.. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చింది. నాచారంలో మూడేళ్లుగా డ్రగ్స్ దందా సాగిస్తోంది. ఇన్నాళ్లుగా ఓ మహిళ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణల తేలడంతో వారు షాక్‌కు గురయ్యారు. అదుపులో తీసుకున్నవారిని విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్‌దందాలో ఇంకెవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

డ్రగ్స్‌ దందాపై పోలీసుల కొరఢా..

హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు అడ్డాగా మారడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి డ్రగ్స్‌ దందాపై దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎంతో డ్రగ్స్‌ ముఠాలను అరెస్టు చేసిన పోలీసులు.. టెక్నాలజీని ఉపయోగించి మరిన్ని దాడులు చేపడుతున్నారు. ఈ దందాను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Pension Scheme: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితే నెలకు రూ.9,250 పెన్షన్‌..!

PAN-Aadhaar Linking: శుభవార్త.. పాన్‌-ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. కానీ..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!