AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High temperatures: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. విదర్భ నుంటి తెలంగాణ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక (Karnataka) వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ(Weather) అధికారులు వెల్లడించారు. దీని...

High temperatures: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
Temperatures
Ganesh Mudavath
|

Updated on: Apr 01, 2022 | 2:38 PM

Share

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. విదర్భ నుంటి తెలంగాణ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక (Karnataka) వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ(Weather) అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ (Telangana) లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. రేపు, ఎల్లుండి అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో వడగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడ 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు.. ఏపీలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. విజయవాడ, విశాఖలోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. బలమైన సముద్ర గాలుల వల్ల కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అయింది. అత్యల్ప ఉష్ణోగ్రత కూడా అక్కడే నమోదైంది. అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలుగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ 4 వరకూ పొడి వాతావరణమే ఉంటుందని, ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వివరించింది.

Also Read

Health Tips: కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది..!