AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: పాముకు చేప నైవేద్యం.. మైకంలో కాలనాగుతో ముచ్చట్లు.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో

మందు మైకం తలెకెక్కింది. ఇంతలో నాగపాము కనిపించింది. దానితో పిచ్చాపాటి మాట్లాడాడు ఆ మందుబాబు. దానికి నీతులు చెప్పాడు. బ్రతిమాలాడు. ఇంకా చాలా కథలు పడ్డాడు. వీడియో లోపల చూడండి...

AP: పాముకు చేప నైవేద్యం.. మైకంలో కాలనాగుతో ముచ్చట్లు.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో
Drunk Man Viral Video
Ram Naramaneni
|

Updated on: Apr 01, 2022 | 3:02 PM

Share

Viral Video: ఓ వ్యక్తి మద్యం మత్తులో ప్రాణాలతో చెలగాటమాడాడు. ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో పాముతోనే పరాచకాలాడాడు. అదృష్టం ఉండడంతో పాము కాటు నుంచి తప్పించుకుని బతికి బట్ట కట్టాడు. ద్వారకా తిరుమల(Dwaraka Tirumala)కు చెందిన మాణిక్యం పెయింటర్ పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే అతను తాగిన మైకంలో ఓ చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్ళాడు. అక్కడ ఓ నాగుపాము అతని కంట పడింది. ఇంకేముంది మద్యం మత్తులో ఉన్న మాణిక్యం దాని వద్దకు వెళ్ళాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మ అంటూ… పాము తో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ‘నేను ఏమీ చేయను.. భయపడకు.. మనందరం స్నేహితులమే.. ఎందుకు నా మీద బుస బుస లాడుతూ కొప్పడతావు.’. అని పామునే ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా దాని తోక పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో అది కోపంతో కాటు వేయబోతుండగా అదృష్టం కొద్దీ ఆ కాటు నుంచి తప్పించుకున్నారు. నన్ను కరిస్తే నీకేమన్నా వస్తుందా అని, మా మీద కోపం వద్దు అంటూ, పోనీ నీకు భయం వేస్తే చెప్పు దూరంగా విడిచి పెడతానంటూ దాన్ని బ్రతిమిలాడడం మొదలు పెట్టాడు. అంతేకాక నన్ను కరిస్తే నీకు ఏమొస్తుంది… నీకే విషం ఎక్కతుందమ్మ అంటూ పాముతో పరాచకాలాడాడు. అంతటితో ఆగకుండా ఆకలేస్తే చేపలు తినమని తన దగ్గర ఉన్న చేపను పాముకు పెట్టబోయాడు. చివరికి ఆ పాము అక్కడినుంచి వెళ్లిపోయింది. కొంచెం సేపు తర్వాత మాణిక్యం కూడా అక్కడ్నుంచి వెనుదిరిగాడు.

 బి. రవి కుమార్, టివి9 తెలుగు, పశ్చిమగోదావరి జిల్లా

Also Read: చైన్ స్నాచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు.. అతడెవరో తెలిసి నిర్ఘాంతపోయిన పోలీసులు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్