AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Godavari: బస్సు సీట్ల కింద లగేజీ క్యారియర్లు.. ఓపెన్‌ చేసి షాక్‌ తిన్న అధికారులు..

Veeravalli Toll Plaza: పశ్చిమగోదావరి జిల్లాలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలంరేపాయి. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

West Godavari: బస్సు సీట్ల కింద లగేజీ క్యారియర్లు.. ఓపెన్‌ చేసి షాక్‌ తిన్న అధికారులు..
Toll Plaza
Basha Shek
|

Updated on: Apr 01, 2022 | 2:44 PM

Share

Veeravalli Toll Plaza: పశ్చిమగోదావరి జిల్లాలో కరెన్సీ నోట్ల కట్టలు కలకలంరేపాయి. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం టోల్ ప్లాజా దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈలోపు పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన AP 39 TB 7555 నంబరు గల బస్సు అటు వైపు వచ్చింది. అనుమానంతో బస్సును ఆపిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బస్సు లగేజ్ డిక్కీలు, సీట్ల కింద సోదాలు చేయగా.. భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎవరి కంటపడకుండా డబ్బుల్ని ఇలా దాచి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. కరెన్సీ నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ క్లీనర్,ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు తరలింపు వెనుక ఎవరున్నారో వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

కాగా పట్టుబడిన నగదు మొత్తం 4 కోట్ల 76 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నగదును టోల్ ప్లాజా కార్యాలయంలో ఉంచారు. ఐటీ అధికారుల సమక్షంలో ఆ డబ్బుల్ని లెక్కించే అవకాశం ఉంది. కాగా ఇటీవల హైవేలు అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి. కొందరు అక్రమార్కులు ఎవరికీ అనుమానం రాకుండా నగదు, బంగారం, వెండి, మద్యం బాటిళ్లను తరలిస్తున్నారు. . కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌ పోస్టు వద్ద హైదరాబాద్‌ నుంచి ఓ కారును తనిఖీ చేయగా సీటు కింద కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. డ్రైవర్‌ సీటు కింద ఉన్న టూల్‌ బాక్సులో ఏకంగా రూ. 65 లక్షల నగదు బయట పడింది. అంతకుముందు చాలా సార్లు పెద్ద మొత్తంలో నగదు, మద్యం బాటిళ్లను అధికారులు పట్టుకున్నారు.

Also Read:PM Modi: వాట్సప్‌ , సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండి.. విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన..

RIMS Recruitment: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఉద్యోగాలు… నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..

Karnataka: ముచ్చటపడి వైన్ ఆర్డరిచ్చిన యువతి.. కట్ చేస్తే ఓ ఫోన్ కాల్.. చివరికి దిమ్మతిరిగే షాక్!

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!