RIMS Recruitment: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఉద్యోగాలు… నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..

RIMS Recruitment 2022: తెలంగాణలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తోన్న ప్రభుత్వం తాజాగా రిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూడ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) కాంట్రాక్ట్‌ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది...

RIMS Recruitment: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఉద్యోగాలు... నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..
Rims Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 01, 2022 | 1:57 PM

RIMS Recruitment 2022: తెలంగాణలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తోన్న ప్రభుత్వం తాజాగా రిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూడ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) కాంట్రాక్ట్‌ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నరు.

* వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (60), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (10) ఉన్నాయి.

* అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల్లో భాగంగా జనరల్‌ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, అబ్‌స్టెట్రిక్స్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఆనెస్తీషియా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణత సాధించింది. టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజస్టర్‌ అయి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఎంబీబీఎస్‌/ మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) మెరిట్‌ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,25,000, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లకు రూ. 52,000 చెల్లిస్తారు.

* ఇంటర్వ్యూలను 11-04-2022 తేదీని నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి…

Also Read: Saree Cake: పచ్చని రంగు పట్టు చీర, బంగారు ఆభరణాలతో కేక్.. ఎంగేజ్ మెంట్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్..

Viral Video: పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. నెటిజన్లు ఫిదా

Market News: నెల ఆరంభంలో పాజిటివ్ గా ప్రారంభమైన సూచీలు.. స్వల్ప లాభాల మధ్య సాగుతున్న ట్రేడ్..