JEE Mains 2022: జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరోసారి రిజిస్ట్రేషన్ తేదీ పొడగింపు.. పూర్తి వివరాలివే..
JEE Mains 2022: జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గుడ్ న్యూస్ చెప్పింది. జేఈఈ మెయిన్స్ 2022 దరఖాస్తు గడువు పొడిగించింది. దీనికి సంబంధించి..
JEE Mains 2022: జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గుడ్ న్యూస్ చెప్పింది. జేఈఈ మెయిన్స్ 2022 దరఖాస్తు గడువు పొడిగించింది. దీనికి సంబంధించి ఎన్టీఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఏ వెబ్‌సైట్‌లోనూ ఈ ప్రకటనను పొందుపరిచింది. తాజా అప్‌డేట్ ప్రకారం.. జేఈఈ మెయిన్ 2022 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 5గా ప్రకటించారు. 5వ తేదీన అర్థరాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. జేఈఈ మెయిన్ 2022 కి దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు పెంపునకు సంబంధించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ అయిన jeemain.nta.nic.in లో చెక్ చేసుకోవచ్చు. కాగా, జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఏప్రిల్‌లో ప్రకటిస్తారు. మొదటి సెషన్ పరీక్షలను ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 వ తేదీల్లో నిర్వహించనుననారు.
జేఈఈ మెయిన్ 2022 దరఖాస్తు ఇలా చేయండి.. 1. NTA JEE మెయిన్ 2022 అధికారిక వెబ్‌సైట్- jeemain.nta.nic.in. కి వెళ్లండి. 2. అభ్యర్థులు పేరు, డేట్ ఆఫ్ బర్త్(DOB), ఇమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వంటి ప్రాథమిక సమాచారాన్ని రిజిస్టర్ చేయాలి. 3. అభ్యర్థులు వారి నమోదిత ఇమెయిల్ ID, మొబైల్ నెంబర్‌కు లాగిన్ వివరాలు అందుతాయి. 4. వాటి ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత జేఈఈ మెయిన్ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది అందులో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, విద్యార్హతతో సహా పూర్తి వివరాలను నమోదు చేయాలి. 5. ఆ తర్వాత, అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సంతకం స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాలి. 6. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించండి.
Also read:
Vijayawada Temple: రేపటి నుంచి వసంత నవరాత్రులు.. ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి