Liger: శరవేగంగా `లైగర్` పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. డబ్బింగ్ పూర్తి చేసిన లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ నటించిన లాస్ట్ మూవీ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా నిరాశ పరచడంతో విజయ్ ఫ్యాన్స్ లైగర్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ నటించిన లాస్ట్ మూవీ వరల్డ్ ఫెమస్ లవర్ నిరాశ పరచడంతో విజయ్ ఫ్యాన్స్ లైగర్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు.. అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. అలాగే ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. లైగర్ సినిమాతో ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలోకి అడుగుపెట్టాడు. ఇటీవలే యుఎస్‌ఎలో విజయ్ దేవరకొండతో పాటు మైక్ టైసన్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మైక్ టైసన్ ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. “నా పట్ల దయ చూపినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కృతజ్ఞుడను, ”అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు.
మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించాడు. అతనిపై చిత్రించిన సన్నివేశాలు చిత్రంలో ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటాయని చిత్రయూనిట్ అంటుంది. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగనే చెప్పాలి. పెద్ద స్క్రీన్‌లపై ఈ ఇద్దరి యాక్షన్‌ని చూసేందుకు సినీ ప్రియులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌తో కలిసి, ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన కేచా స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
The final bell has rung!? The legend @MikeTyson has completed his dubbing for #Liger.#VaatLagaDenge pic.twitter.com/LTG9tOHVCV
— Dharma Productions (@DharmaMovies) April 1, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :