Krish- Trivikram: పక్క ప్లాన్ తో రాబోతున్న స్టార్ దర్శకులు.. ఒకరు అలా మరొకరు ఇలా
తెలుగు సినిమా డైరెక్టర్ల సమాజంలో ఇంటలెక్చువల్స్ అనే పేరుండేది ఆ ఇద్దరికే. ఆలోచనల్ని రేకెత్తింపజేసే సినిమాలకు వాళ్లనే స్పెషలిస్టులుగా చెబుతారు. వాళ్ల సినిమాల కోసం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తారు..
తెలుగు సినిమా డైరెక్టర్ల సమాజంలో ఇంటలెక్చువల్స్ అనే పేరుండేది ఆ ఇద్దరికే. ఆలోచనల్ని రేకెత్తింపజేసే సినిమాలకు వాళ్లనే స్పెషలిస్టులుగా చెబుతారు. వాళ్ల సినిమాల కోసం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తారు… వాళ్లను ప్రాణసమానంగా ప్రేమిస్తారు కూడా. వాళ్లిద్దరు మాత్రం ఇప్పుడు డైవెర్షన్ తీసుకుని… ఎటెటో ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు క్రేజీ కెప్టెన్లు. కంచె, వేదం లాంటి ఇంటెన్సిటీతో కూడిన సినిమాలు తెలుగు ఆడియన్స్‌లో క్రిష్ (Krish)జాగర్లమూడికంటూ స్పెషల్ ప్లేస్‌నిచ్చేశాయి. తర్వాత బాలయ్యతో రెండు సినిమాలు చేసి… ఆ వెంటనే డీవియేషన్ తీసుకున్నారు క్రిష్. కోవిడ్ గ్యాప్‌లో తనకిష్టమైన నవలల్ని చదవడమే కాదు.. వాటిని తెరకెక్కంచడం మొదలెట్టారు. పాపులర్ తెలుగు నవల కొండపొలంని టేకప్ చేసి వైష్ణవ్‌కి ఫీల్‌గుడ్ సినిమానిచ్చారు క్రిష్. అక్కడితోనే ఆగలేదు. మల్లాది వెంకటక్రిష్ణమూర్తి రాసిన 9 గంటలు నవలను కూడా ఓ పట్టు పడుతున్నారు. దాన్ని వెబ్‌సిరీస్‌గా తీసే ప్లాన్‌లో వున్నారట. ఈ నవలా నాయకుడి మేటర్ ఇలా వుంటే… అటు మాటల మాంత్రికుడు కూడా పక్కచూపులే చూస్తున్నారు.
అల్లు అర్జున్‌కొచ్చిన గ్యాప్‌ని విజయవంతంగా పూర్తి చేసి.. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. తర్వాత ఆయనే గ్యాపులో పడ్డారు. రెండు క్యాలెండర్లు దాటినా మెగాఫోన్ పట్టనే లేదు. తన ఒరిజినాలిటీని పక్కకుపెట్టి రీమేక్స్ మీద మనసు పడ్డారు త్రివిక్రమ్. ఒక మలయాళ సినిమాను వర్కవుట్ చేసి పవర్‌స్టార్ కెరీర్‌కి బ్లాక్‌బస్టర్ సౌండ్ ఇచ్చారు త్రివిక్రమ్. కానీ… డైరెక్టర్‌గా కాదు… ఇన్‌డైరెక్ట్‌గా. ఇప్పుడు పవన్ కోసమే తమిళ్ నుంచి మరో మల్టిస్టారర్‌ని తిరగ రాస్తున్నారట. సాయిధరమ్ సెకండ్ హీరోగా త్వరలో ఈ ప్రాజెక్ట్ కూడా లాంచవబోతోంది. ఇలా ఇరుగుపొరుగు కంటెంట్ మీద ఫోకస్ పెట్టి… స్క్రీన్‌ప్లే రైటర్‌గానే టైమ్‌పాస్ చేస్తున్న గురూజీ నుంచి ఒరిజినల్ ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పవర్‌స్టార్‌తో క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు, సూపర్‌స్టార్‌తో త్రివిక్రమ్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ పట్టాలెక్కి… సజావుగా షూటింగ్ కంప్లీట్ చేసుకునేదాకా ఆ ఇద్దరు మేధావుల ఒరిజినల్ స్టఫ్‌ని ఎంజాయ్ చేసే ఛాన్స్ లేదు మరి.
మరిన్ని ఇక్కడ చదవండి :