AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paruchuri: అన్నయ్య అలా మారడానికి అదే కారణం.. వైరల్‌ ఫోటోపై స్పందించిన పరుచూరి గోపాల కృష్ణా..

Paruchuri: ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వర రావు (Paruchuri Venkateswara Rao) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో (Social Media) భారీ ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఓ ఫోటో కూడా నెట్టింట వైరల్‌..

Paruchuri: అన్నయ్య అలా మారడానికి అదే కారణం.. వైరల్‌ ఫోటోపై స్పందించిన పరుచూరి గోపాల కృష్ణా..
Narender Vaitla
|

Updated on: Apr 01, 2022 | 12:48 PM

Share

Paruchuri: ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వర రావు (Paruchuri Venkateswara Rao) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో (Social Media) భారీ ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఓ ఫోటో కూడా నెట్టింట వైరల్‌ అయ్యింది. ఈ విషయంపై ఎవ్వరూ స్పందించకపోయేసరికి ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. దీంతో వెంకటేశ్వర రావు ఆరోగ్యానికి సంబంధించిన పుకార్లు ఎంతకీ ఆగకపోవడంతో ఆయన సోదరుడు పరుచూరి గోపాల కృష్ణ ఎట్టకేలకు స్పందించారు. తన అన్నయ్య ఆరోగ్య వివరాలను వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోలో గోపాల కృష్ణ మాట్లాడుతూ..’చాలా మంది అన్నయ్య ఫోటో చూసి మాట్లడండి అని అడిగారు. ఆయన చాలా బాగున్నారు. అయితే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు అక్కడ చిన్న తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు. ఆహార విధానంలో మార్పులు రావడంతో ఆయన 10 కిలోలు తగ్గారు. దీంతో అలా కనిపించారు. నేను కూడా ఈ రెండేళ్లలో 10 కిలోలు తగ్గాను. కానీ నేను ఎక్కువ బరువు ఉండేసరికి నాలో పెద్దగా మార్పులు కనిపించలేవు.

అన్నయ్య తక్కువ బరువు ఉండేసరికి మార్పులు కనిపించింది. ఆయన మేధస్సు అలాగే ఉంది. నేను ఫోన్‌లో ఆయనతో మాట్లాడుతుంటాను. వయసు మీదపడే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. అన్నయ్య క్షేమంగా ఉన్నాడు. అభిమానులు, అన్నయ్యను ప్రేమించే వారు ధైర్యంగా’ ఉండండి అని చెప్పుకొచ్చారు. పరుచూరి గోపాల కృష్ణ ఇంకా ఏమన్నారంటే..

Also Read: America: పాఠశాలలో కాల్పుల మోత.. 20 మంది విద్యార్థులను కాపాడిన తెలుగు వ్యక్తి..

Viral Video: మాకు దక్కనిది ఇంకెవ్వరికీ చిక్కనివ్వం.. అంటున్న మొసళ్లు

అబ్రకదబ్ర.. కంటి ముందున్న వ్యక్తి ని మాయం చేసే షీట్‌ వచ్చేసింది!