Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada Temple: రేపటి నుంచి వసంత నవరాత్రులు.. ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ(vijayawada) ఇంద్రకీలాద్రి మరో వేడుకలకు సిద్ధమైంది. ఏప్రిల్‌ రెండు నుంచి పదో తారీఖు వరకు ఆలయంలో వసంత నవరాత్రులు జరగనున్నాయి. చైత్ర మాసం కావడంతో..

Vijayawada Temple: రేపటి నుంచి వసంత నవరాత్రులు.. ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
Viajaywada Temple
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 01, 2022 | 6:05 PM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ(vijayawada) ఇంద్రకీలాద్రి మరో వేడుకలకు సిద్ధమైంది. ఏప్రిల్‌ రెండు నుంచి పదో తారీఖు వరకు ఆలయంలో వసంత నవరాత్రులు జరగనున్నాయి. చైత్ర మాసం కావడంతో రెండో తేదీ నుంచి 10 తేదీ వరకు వసంత నవరాత్రులు(vasantha navarathri), 12 నుంచి 20 వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలు అంగరంగవైభంగా నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన పుష్పాలతో(Flowers) దుర్గామల్లేశ్వర స్వామి, దేవి వారిని అలంకరించి పూజిస్తారు. ఉగాది పండుగ సందర్భంగా.. ఏప్రిల్ రెండో తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకారం, అర్చన, నివేదన, హారతి తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు.

ఉదయం 8 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 9 గంటలకు కలశ స్థాపన, పుష్పార్చన చేస్తారు. 10 గంటలకు మల్లికార్జున మహామండపం ఏడో అంతస్తుపై మహారాజగోపురం ఎదురుగా కళావేదిక వద్ద పంచాంగ శ్రవణం ఉండనుంది. సాయంత్రం 4 గంటలకు యాగశాలలో అగ్నిప్రతిష్టాపన, రుద్ర హోమం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు మహామండపం వద్ద గంగా సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను వెండి రథంపై ఊరేగించనున్నారు.

తొలిరోజు వసంత నవరాత్రోత్సవాల సందర్భంగా 2 వ తేదీన మల్లెపూలు, ఏప్రిల్ 3 న కనకాంబరాలు, ఏప్రిల్ 4 న తెల్లచామంతి, ఏప్రిల్ 5 న మరువం, సంపంగి, ఏప్రిల్ 6న కాగడా మల్లెలు, తామర పుష్పాలు, ఏప్రిల్ 7న పసుపు పచ్చ చామంతులు, సన్నజాజులు, ఏప్రిల్ 8వ తేదీన ఎర్ర మందారం, ఎర్ర గన్నేరు, ఏప్రిల్ 9న అన్ని రకాల పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు చేయనున్నారు.

Also Read

Megha Group: హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా గ్రూప్.. డ్రిల్‌మెక్‌చే ఇడ్రోజెన స్టార్ట్‌అప్‌ ప్రారంభం

Vizag Manyam: మన్యం గిరుల్లో కాఫీ పూల ఘుమఘుమలు..!.. శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న విరులు

Rimi Sen: దారుణంగా మోసపోయిన మెగాస్టార్ హీరోయిన్.. ఏకంగా నాలుగు కోట్లు పోగొట్టుకుందట..

డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
పేరులేని రైల్వే స్టేషన్.. కారణం తెలిస్తే షాకే..
పేరులేని రైల్వే స్టేషన్.. కారణం తెలిస్తే షాకే..
బెంగళూరు లైంగింక వేధింపుల నిందితుడు అరెస్ట్..ఎక్కడ దొరికాడంటే?
బెంగళూరు లైంగింక వేధింపుల నిందితుడు అరెస్ట్..ఎక్కడ దొరికాడంటే?
చార్ ధామ్ యాత్రలో ముందు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి? ప్రాముఖ్యత
చార్ ధామ్ యాత్రలో ముందు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి? ప్రాముఖ్యత
అమరావతి 2.0.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..
అమరావతి 2.0.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..
బుమ్రా, కరుణ్ నాయర్ గొడవ.. రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవల్
బుమ్రా, కరుణ్ నాయర్ గొడవ.. రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవల్
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!